సినిమా పరిశ్రమలో అలాంటి వాళ్ళని నమ్మకూడదు...  

Iddarammayilatho serial fame actress Vaishnavi sensational comments about casting couch in film industry, Iddarammayilatho serial, Vaishnavi , Telugu Serial actress, Sai Durga actress, Casting couch Issue, Telugu film Industry, Tollywood - Telugu Casting Couch Issue, Iddarammayilatho Serial, Iddarammayilatho Serial Fame Actress Vaishnavi Sensational Comments About Casting Couch In Film Industry, Sai Durga Actress, Telugu Film Industry, Telugu Serial Actress, Tollywood, Vaishnavi

తెలుగులో ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయిన జీ తెలుగు ఛానల్ లో ప్రసారమయ్యే ఇద్దరమ్మాయిలతో అనే ధారావాహిక ద్వారా బుల్లితెర పరిశ్రమకి నటి గా పరిచయమైన నూతన నటి వైష్ణవి గురించి బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితమే.అయితే ఇప్పుడిప్పుడే తన సినీ కెరీర్ ని మొదలు పెట్టి అవకాశాలు దక్కించుకుంటూ బాగానే రాణిస్తోంది వైష్ణవి.

TeluguStop.com - Iddarammayilatho Serial Fame Actress Vaishnavi Sensational Comments About Casting Couch In Film Industry

 అయితే తాజాగా నటి వైష్ణవి ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొని సినిమా పరిశ్రమలో జరిగేటటువంటి మోసాల గురించి ప్రేక్షకులతో పంచుకుంది.

అయితే ఇందులో భాగంగా ఈ మధ్య కాలంలో సినిమా పరిశ్రమలో కొందరు అవకాశాల పేరుతో లొంగతీసుకోవాలని చూస్తున్నారని, కాబట్టి అలాంటి వాళ్ళని అస్సలు నమ్మకూడదని తెలిపింది.

TeluguStop.com - సినిమా పరిశ్రమలో అలాంటి వాళ్ళని నమ్మకూడదు…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

 అంతే కాక కొందరు తమకి కొంతమంది పెద్దలు సినిమా పరిశ్రమలో తెలుసని దీంతో సినిమా అవకాశాలు ఇప్పిస్తామని పరిచయం చేసుకొని తర్వాత వారిని కోరికలు తీర్చుకోవడానికి ఉపయోగించుకుంటారని అలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలని కూడా సూచించింది.

అలాగే తాను ఇప్పటివరకు అలాంటి పరిస్థితులను ఎదుర్కోలేదు కానీ చాలా మంది చెబుతుంటే విన్నానని తెలిపింది.

అయితే తనకి అవుట్ డోర్ షూటింగులు ఉన్నప్పుడు లేదా ఏదైనా ఈవెంట్స్ లో గాని, షో లో గాని పాల్గొంటున్నప్పుడు తన వెంట తన తల్లిదండ్రులు ఖచ్చితంగా తోడు వస్తారని అందువల్లనే తాను ఇప్పటి వరకు ఎలాంటి కాస్టింగ్ కోచ్ సమస్యలను ఎదుర్కోలేదని చెప్పుకొచ్చింది.

ఇక తన సోదరుడు మరియు సోదరి కూడా సినిమా పరిశ్రమలో నటీనటులుగా రాణిస్తున్నారని తెలిపింది.

 అయితే తన సోదరి దుర్గ ప్రస్తుతం తెలుగులో స్టార్ మా మరియు జీ తెలుగు తదితర ఛానళ్లలో ప్రసారం అవుతున్న ధారావాహికలలో నటిస్తోందని చెప్పుకొచ్చింది.

#TeluguFilm #CastingCouch #Vaishnavi #TeluguSerial

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు