100 ఏళ్ల నాటి మిస్సింగ్ కేసును ఛేదించిన పోలీసులు: ఇదే కేసులో వీడని మరో మిస్టరీ..!!!

ప్రపంచంలో అప్పుడప్పుడు కొన్ని వింతలు జరుగుతూ ఉంటాయి.అవి జరిగిన తర్వాత ఇలాంటివి కూడా ఉంటాయా అనిపిస్తుంటుంది.అమెరికాలో అచ్చం ఇలాంటి సంఘటనే జరిగింది.100 ఏళ్ల క్రితం జైలు నుంచి తప్పించుకున్న ఓ వ్యక్తి అదృశ్యం మిస్టరీగా మారింది.అయితే అతని మృతదేహానికి చెందిన అవశేషాలను డీఎన్ఏ ద్వారా గుర్తించి ఆయన చనిపోయినట్లుగా అధికారులు వెల్లడించారు.

 Idaho Since1916solved Dna-TeluguStop.com

Telugu Idaho, Solved Dna, Telugu Nri Ups-

వివరాల్లోకి వెళితే.1870లో ఉటాలో జన్మించిన జోసెఫ్ హెన్రీ లవ్లెస్ అనే వ్యక్తి 1916లో తన భార్యను గొడ్డలితో నరికి చంపాడు.ఇందుకుగాను అప్పటి ఫ్రీమాంట్ కౌంటీలోని సెయింట్ ఆంటోనీ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు.

ఈ క్రమంలో మే 18,1916న షూలో దాచిపెట్టిన రంపం సాయంతో జైలు నుంచి తప్పించుకున్నాడు.అతని కోసం గాలించిన పోలీసులకు లవ్లెస్ ఆచూకీ లభించలేదు.అదే సమయంలో అతని ఆచూకీ తెలపాల్సిందిగా పోస్టర్లను ప్రభుత్వం గోడలపై అంటించింది.

Telugu Idaho, Solved Dna, Telugu Nri Ups-

ఈ క్రమంలో కొన్ని దశాబ్ధాల తర్వాత 1979 ఆగస్టులో డుబోయిస్‌కు సమీపంలోని ఒక గుహలో ఒక కుటుంబం గోనే సంచిలో ఉన్న పురుషుడి మొండెంను కనుగొన్నారు.మృతదేహంపై ముదురు రంగు ప్యాంటు, బ్లూపిన్ చారలతో తెల్లటి చొక్కా, మెరూన్ కలర్ స్వెటర్ ఉంది.12 సంవత్సరాల తర్వాత అదే గుహలో పర్యటించిన ఇదాహో స్టేట్ యూనిర్సిటీ సిబ్బంది, విద్యార్ధులు గోనె సంచిలో చుట్టబడిన ఒక చేయి, రెండు కాళ్లను కనుగొన్నారు.ఈ అవశేషాలు ఎవరివో నిర్ధారించేందుకు గాను వర్సిటీకి చెందిన ఆంత్రోపాలజీ ప్రొఫెసర్లు, విద్యార్ధులు ముందుకు వచ్చారు.అలాగే ఎన్జీవో సంస్థ డీఎన్ఏ డూ ప్రాజెక్ట్ సంస్థ సైతం వారికి సాయం చేసింది….

Telugu Idaho, Solved Dna, Telugu Nri Ups-

ఇందుకోసం సదరు ఎన్జీవో ఎన్నో అడ్డంకులను అధిగమించాల్సి వచ్చింది.లవ్‌లెస్ ఉపయోగించిన ఎన్నో మారుపేర్లతో సంబంధం ఉన్న పేర్లు నేషనల్ డేటా బేస్‌‌లో దొరకలేదు.ఉన్న కొద్దిపాటి సమాచారంతో వాలంటీర్లు సుమారు 31,730 మంది వ్యక్తులకు డీఎన్ఏ టెస్ట్ నిర్వహించారు.ఈ క్రమంలో క్లార్క్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం కాలిఫోర్నియాలో నివసిస్తున్న 87 ఏళ్ల లవ్లెస్ మనవడిని గుర్తించి డీఎన్ఏ టెస్ట్‌ నిర్వహించింది.

ఈ పరీక్షలో లవ్‌లెస్ డీఎన్ఏతో అతని డీఎన్ఏ మ్యాచ్ అయ్యింది.దీంతో 100 ఏళ్ల నాటి చిక్కుముడి వీడినట్లయ్యింది.అయితే లవ్‌లెస్‌ను ఇంత దారుణంగా హత్య చేసినది ఎవరనేది మాత్రం ఇంకా మిస్టరీగానే ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube