సక్సెస్‌ స్టోరీ : కూలీ కొడుకు, 6వ తరగతి ఫెయిల్‌ అయ్యాడు.. ఇప్పుడు రోజుకు రూ. 2 కోట్ల వ్యాపారం

కొందరు సక్సెస్‌ అయిన వ్యక్తులను పరిశీలిస్తే వారు చదువు వారికి ఆ సక్సెస్‌ను తెచ్చి పెట్టలేదు, వారి బ్యాక్‌ గ్రౌండ్‌ వల్ల వారు సక్సెస్‌ అవ్వలేదు, కేవలం వారి పట్టుదల, ముందస్తు చూపు వల్లే వారు సక్సెస్‌ అయ్యారు.ఎంతో మంది ఈ ప్రపంచంలో ఉన్నారు.

 Id Fresh Food Founder Musthafa Success Story-TeluguStop.com

అయితే వారిలో కొందరు మాత్రమే చాలా విభిన్నంగా ఆలోచిస్తూ జీవితంలో విజయాలను అందుకుంటున్నారు.ఆ విజయాలు మనందరికి స్ఫూర్తి.

అయితే వారి విజయాల గురించి మనం తెలుసుకుని వదిలేయకుండా, వారి విజయాలను ఇన్సిపిరేషన్‌గా తీసుకుని కష్టపడాలి.ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్న వ్యక్తి పేరు ముస్తాఫా.

ఇతడి తండ్రి కూలీ పని చేసేవాడు, కాని ఇప్పుడు ముస్తాఫా మాత్రం 300 కోట్ల వ్యాపార సామ్రాజ్యంను నడుపుతున్నాడు

పూర్తి వివరాల్లోకి వెళ్తే… కేరళలలోని ఒక మారుమూల గ్రామంలో జన్మించాడు ముస్తఫా.ఈయన పుట్టిన ఊర్లో కనీసం రోడ్లు కూడా సరిగా లేదు.

అంతటి దయనీయ పరిస్థితులున్న ఊర్లో జన్మించిన ముస్తఫా ఆరవ తరగతిలో ఫెయిల్‌ అయ్యాడు.అన్ని సబ్జెక్ట్‌లలో ఫెయిల్‌ అయినా మ్యాథ్స్‌లో మాత్రం ముస్తఫా ముందు ఉండేవాడు.

ఆరవ తరగతి ఫెయిల్‌ అవ్వడంతో కొన్ని రోజులు స్కూల్‌ మానేశాడు.ఆ తర్వాత మళ్లీ స్కూల్‌లో జాయిన్‌ అయ్యాడు.

స్కూల్‌లో చదువుతున్న సమయంలోనే ఏదో ఒక పని చేసి డబ్బులు సంపాదించాలనే ఉద్దేశ్యంతో స్వీట్లు తయారు చేసి అమ్మేవాడు.

సక్సెస్‌ స్టోరీ : కూలీ కొడుకు, 6

చదువుపై పెరిగిన ఆసక్తితో ఇంటర్‌ మంచిమార్కులతో పాస్‌ అవ్వడంతో పాటు ఎంసెట్‌ స్టేట్‌ 63వ ర్యాంక్‌ దక్కించుకున్నాడు.చదువులో అద్బుతాలు సృష్టించి ఉన్నత చదువులు పూర్తి చేశాడు.దుబాయిలో నెలకు లక్ష రూపాయల జీతంతో ఉద్యోగంలో చేరాడు.

అయితే అది ఆయనకు సంతృప్తిని ఇవ్వలేదు.ఒక రోజు తన సోదరి ఇంటికి వెళ్లిన సమయంలో కిరాణా షాప్‌ వద్ద నిల్చున్నాడు.

సక్సెస్‌ స్టోరీ : కూలీ కొడుకు, 6

అక్కడ రెడీ మిక్స్‌ వంటకాల పదార్థాలు బాగా అమ్ముడు పోవడం గమనించాడు.దాంతో మనం ఎందుకు ఆ బిజినెస్‌ చేయలని ఆలోచించాడు.అనుకున్నదే తడువుగా పాతిక వేల రూపాయల పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించాడు.ఐడీ ఫ్రెష్‌ అనే బ్రాండ్‌తో ఇడ్లీ, వడ, రాగి ఇడ్లీ, మలబార్‌ పరాఠా ఇలా 8 రకాల వంటలకు సంబంధించిన రెడీ మిక్స్‌ను ముస్తాఫా తయారు చేస్తున్నాడు

సక్సెస్‌ స్టోరీ : కూలీ కొడుకు, 6

2018 సంవత్సరంలో ముస్తాఫా వ్యాపారం 300 కోట్లకు చేరింది.ప్రతి రోజు రెండు కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది.దాదాపు రెండు వేల మంది ఉద్యోగులు ఐడీ ఫ్రెష్‌ కంపెనీలో జాబ్‌ చేస్తున్నారు.

తాను పెట్టుకున్న నమ్మకం నిలచిందని, వెయ్యి కోట్ల టర్నోవర్‌ దిశగా తాము వెళ్తున్నట్లుగా ముస్తాఫా చెబుతున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube