ఆ సమస్య తర్వాత పుష్ప షూటింగ్ ప్రారంభం..?

డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప‘.భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

 Icon Star Allu Arjun New Movie Pushpa Movie Shooting Start In Hyderabad After Sukumar Recovered From Fever-TeluguStop.com

ఇక ఈయన సరసన ఇండియన్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమా అక్రమంగా రవాణా చేస్తున్న గంధపు చెక్కల నేపథ్యంలో రూపొందుతుంది.

ఇదిలా ఉంటే ఓ సమస్యతో కొన్ని రోజులు వాయిదా పడ్డ ఈ సినిమా తిరిగి మళ్లీ షూటింగ్ లో బిజీ గా ఉంది.

 Icon Star Allu Arjun New Movie Pushpa Movie Shooting Start In Hyderabad After Sukumar Recovered From Fever-ఆ సమస్య తర్వాత పుష్ప షూటింగ్ ప్రారంభం..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

గతంలో ఈ సినిమా షూటింగ్ కోవిడ్ కారణంగా వాయిదా పడగా అదే సమయంలో డైరెక్టర్ సుకుమార్ తన అనారోగ్య సమస్యతో బాధ పడటంతో ఈ సినిమా షూటింగ్ మళ్ళీ కొన్ని రోజులు వాయిదా పడింది.

ఇక తాజాగా సుకుమార్ తన అనారోగ్య సమస్య కోలుకోవడంతో తిరిగి షూటింగ్ మొదలు పెట్టినట్లు తెలుస్తుంది.ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది.

ఇక అల్లు అర్జున్ తో కొన్ని సీన్స్ కూడా చేస్తున్నారు.ఇక ఈ సినిమాను అనుకున్న సమయానికి విడుదల చేయడానికి గట్టి నిర్ణయం తీసుకున్నారు దర్శక నిర్మాతలు.

Telugu After Sukumar Recovery, Allu Arjun, Pushpa Movie Shooting, Pushpa Shooting, Pushpa Shooting Update, Sukumar-Movie

ఈ సినిమాను రెండు భాగాలుగా చేసిన సంగతి తెలిసిందే.ఇందులో అల్లు అర్జున్ ఊర మాస్ లుక్ లో కనిపించనున్నాడు.ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.ఈ సినిమాలో మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు.అంతేకాకుండా యాంకర్ అనసూయ, కమెడియన్ సునీల్ కూడా విలన్ పాత్రలో నటిస్తున్నట్లు తెలిసింది.మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఇక ఇందులో దేవిశ్రీప్రసాద్ తన సంగీతాన్ని వినిపిస్తున్నాడు.ఈ సినిమా కోసం బన్నీ అభిమానులు తెగ ఎదురు చూస్తున్నారు.

ఇది వరకే సుకుమార్, బన్నీ కాంబినేషన్ లో ఆర్య, ఆర్య 2 ప్రేక్షకుల ముందుకి రాగా.మరోసారి వీరి కాంబినేషన్ లో వస్తున్న పుష్ప సినిమా ఎటువంటి సక్సెస్ ను అందుకుంటుందో చూడాలి.

#Allu Arjun #PushpaShooting #Sukumar #Pushpa Shooting #AfterSukumar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు