సరికొత్త రికార్డు సృష్టించిన అల్లు అర్జున్.. ఈసారి ఏంటంటే?

Icon Star Allu Arjun Got 15 Million Followers In Instagram

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.బన్నీ కి ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి మనందరికీ తెలిసిందే.

 Icon Star Allu Arjun Got 15 Million Followers In Instagram-TeluguStop.com

అల్లు అర్జున్ కు కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాకుండా, బాలీవుడ్ లో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.అంతేకాకుండా సౌత్ ఇండస్ట్రీలో మరే హీరోకి కూడా సాధ్యం కాని రీతిలో అల్లు అర్జున్ కి రోజు రోజుకి ఫాలోవర్స్ పెరిగిపోతున్నారు.

అల్లుఅర్జున్ ఇంస్టాగ్రామ్ ఖాతాలో అతనికి ఏకంగా 15 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు.అంటే కోటి యాభై లక్షల మంది ఫాలోవర్స్ ను సంపాదించుకున్నాడు బన్నీ.

 Icon Star Allu Arjun Got 15 Million Followers In Instagram-సరికొత్త రికార్డు సృష్టించిన అల్లు అర్జున్.. ఈసారి ఏంటంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సౌత్ ఇండస్ట్రీ లో ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న హీరోగా ఈ రికార్డును అందుకున్న తొలి హీరో బన్నీ కావడం విశేషం.ఇంస్టాగ్రామ్ అకౌంట్ తెరిచిన నాలుగున్నర సంవత్సరాల లోపు ఈ ఘనతను అందుకున్నాడు బన్నీ.

మొదట అల్లు అర్జున్ 2017 నవంబర్ లో ఈ ఇంస్టాగ్రామ్ లోకి వచ్చారు.అలా అప్పటి నుంచి తనకు సంబంధించిన విషయాల గురించి, తన సినిమాల గురించి తన అభిమానులతో ముచ్చటిస్తూ ఉండేవారు.

ఒకవైపు సినిమాలలో నటిస్తూనే తనకు సమయం దొరికినప్పుడల్లా తన అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటారు.ఇక తన సినిమాలకు సంబంధించిన చిన్న అప్డేట్లను ఇస్తూ తన అభిమానులను కృషి చేస్తుంటారు.

Telugu Followers, Allu Arjun, Tollywood-Movie

అలా చిన్న చిన్నగా తన ఫాలోవర్స్ ను పెంచుకుంటూ ప్రస్తుతం ఏకంగా 15 మిలియన్ ఫాలోవర్స్ ని సంపాదించుకున్నాడు అల్లు అర్జున్.ఇలా తొలి రికార్డు అందుకున్న సౌత్ ఇండియన్ హీరో అయ్యారు బన్ని.అందుకే అల్లు అర్జున్ ని అభిమానులు సౌత్ కా సుల్తాన్ అని కూడా పిలుస్తుంటారు.అయితే తనకు 15 మిలియన్ల ఫాలోవర్స్ వచ్చిన సందర్భంగా అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా తన అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు.

ఇక ఇటీవలే అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమా రిలీజ్ అయిన విషయం అందరికి తెలిసిందే.ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.

అల్లు అర్జున్ ఖాతాలో ఒక అరుదైన ఘనతను సాధించింది.పుష్ప సినిమాలో అల్లు అర్జున్ నటనకుగాను టాలీవుడ్ ప్రముఖులతో పాటు బాలీవుడ్ ప్రముఖులు కూడా ప్రశంసల వర్షం కురిపించారు.

#Followers #Allu Arjun

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube