వకీల్ సాబ్ హిట్... ఐకాన్ స్టార్ తో నుంచి ఐకాన్ కి గ్రీన్ సిగ్నల్- Icon Movie Line Clear With Vakeel Saab Hit

Icon Movie Line Clear With Vakeel Saab Hit, Pawan Kalyan, Dil Raju, Stylish Star Allu Arjun, Icon Star, Pushpa Movie - Telugu Dil Raju, Icon Movie, Icon Star, Pawan Kalyan, Pushpa Movie, Stylish Star Allu Arjun, Vakeel Saab Hit

స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా అల్లు అర్జున్ తన బ్రాండ్ నేమ్ మార్చుకున్న సంగతి తెలిసిందే.పుష్ప సినిమాతో సుకుమార్ బన్నీకి ఈ బ్రాండ్ ని తగిలుస్తున్నాడు.

 Icon Movie Line Clear With Vakeel Saab Hit-TeluguStop.com

పాన్ ఇండియా రేంజ్ లో పుష్ప సినిమా తెరకెక్కుతుంది.మరి ఐకాన్ స్టార్ బ్రాండ్ కి తగ్గట్లు తనని తాను అల్లు అర్జున్ ఎంత వరకు ఎలివేట్ చేసుకుంటాడు అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

ఇదిలా ఉంటే అల్లు అర్జున్ సుకుమార్ పుష్ప కంటే ముందుగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా ఐకాన్ అనే సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.ఆ ప్రాజెక్ట్ పై కొద్ది రోజులు వర్క్ కూడా చేశారు.

 Icon Movie Line Clear With Vakeel Saab Hit-వకీల్ సాబ్ హిట్… ఐకాన్ స్టార్ తో ఐకాన్ ని పట్టాలెక్కించే ఛాన్స్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఏమైందో ఏమో రంగస్థలం సూపర్ హిట్ తో అల్లు అర్జున్ సుకుమార్ తో నెక్స్ట్ సినిమా చేయడానికి ఫిక్స్ అయ్యి ముందుకి వెళ్ళిపోయాడు.ఇక పుష్ప తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు.

ఈ సినిమా వైజాగ్ గ్యాస్ లీక్ ఘటన నేపధ్యంలో ఉంటుందని బోగట్టా.

ఇదిలా ఉంటే దర్శకుడు వేణు శ్రీరామ్ ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు.

ఈ సినిమా రికార్డు స్థాయి కలెక్షన్స్ చేయడం పక్కా అనే క్లారిటీ ఇప్పటికే వచ్చేసింది.ఈ సినిమా కంటే ముందుగా వేణు శ్రీరామ్ నానితో ఎంసీఏ సినిమా చేశాడు.

అది ఎవరేజ్ పడింది.ఈ కారణంగానే ఐకాన్ సినిమాని బన్నీ పక్కన పెట్టాడని టాక్ ఉంది.

ఒకవేళ వకీల్ సాబ్ సినిమా హిట్ అయితే వేణుశ్రీరామ్ తో ఐకాన్ సినిమా చేయాలని అనుకున్నాడు.ఇప్పుడు వకీల్ సాబ్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.

ఈ నేపధ్యంలో దిల్ రాజుకి కూడా వేణు మీద మరింత కాన్ఫిడెంట్ వచ్చింది.ఇక అల్లు అర్జున్ కూడా వేణుతో ఐకాన్ సినిమా వర్క్ స్టార్ట్ చేయమని సలహా ఇచ్చినట్లు టాక్ వినిపిస్తుంది.

.

#Dil Raju #StylishStar #Pawan Kalyan #Vakeel Saab Hit #Icon Star

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు