74 ఏళ్ల వృద్ధురాలికి ఐవీఎఫ్ చికిత్స అందించిన అహల్య ఆసుపత్రికి నోటీసులు

ఇటీవల తూర్పు గోదావరి జిల్లా కు చెందిన మంగాయమ్మ అనే 74 ఏళ్ల వృద్ధురాలు ఐవీఎఫ్ విధానం ద్వారా కవలలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.అయితే ఇలా ఆమె జన్మనివ్వడం ఒక ప్రపంచ రికార్డ్ గా కూడా చెప్పుకున్నారు.

 Icmrissues Notice To Gunturahalya Hospital-TeluguStop.com

అయితే రికార్డ్ ల సంగతి పక్కన పెడితే అసిస్టెడ్ రీ ప్రొడక్టివ్ టెక్నాలజీ(రెగ్యులేషన్) బిల్లు-2017 ప్రకారం 18 ఏళ్ల లోపు-45 ఏళ్ల పై బడిన వారికీ ఇలా ఐవీఎఫ్ చికిత్స అందించడం నిషేధం.దీనితో ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ విధానాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అంటూ మంగాయమ్మ కు ఐవీఎఫ్ చికిత్సా విధానాన్ని అందించిన గుంటూరు లోని అహల్య హాస్పిటల్ యాజమాన్యం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అయితే గతేడాది నవంబర్‌లో మంగాయమ్మ దంపతులు అహల్య హాస్పిట‌ల్‌ను సంప్రదించగా ఐవీఎఫ్‌ నిపుణుడు డాక్టర్‌ శనక్కాయల ఉమాశంకర్‌ ఆమెను పరీక్షించి, ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకపోవడంతో ఐవీఎఫ్ విధానం చికిత్స ప్రారంభించారు.అయితే, దీనిపై పలు విమర్శలు వెల్లువెత్తాయి.

ఇండియన్‌ సొసైటీ ఆఫ్‌ అసిస్టెడ్‌ రీప్రొడక్షన్‌, ఇండియన్‌ ఫెర్టిలిటీ సొసైటీ రీప్రొడక్షన్‌ తదితర సంఘాలు దీనిపై మండిపడ్డాయి.ఈ నేపథ్యంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ఐసీఎంఆర్) అహల్య హాస్పిటల్‌కు నోటీసు జారీ చేసింది.74 ఏళ్ల వయసులో ఐవీఎఫ్‌ విధానంలో గర్భధారణ చేయడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది.

Telugu Guntur, Guntur Ahalya, Icmr, Ivf, Telugu Ups-

  ఈ విషయంలో మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని హాస్పిటల్ నిర్వాహకుడు డాక్టర్‌ శనక్కాయల ఉమాశంకర్‌ను కోరింది.ఐసీఎంఆర్‌ రీప్రొడక్టివీ బయాలజీ మెటర్నల్‌హెల్త్‌ అండ్‌ చైల్డ్‌ హెల్త్‌ సైంటిస్టు డాక్టర్‌ ఆర్‌.ఎఫ్‌.

శర్మ దీనిని ధ్రువీకరించారు.ఈ విషయంపై డాక్టర్ ఉమాశంకర్‌ను వివరణ కోరగా తనకు ఎలాంటి నోటీసులు రాలేదని ఆయన చెప్పడం విశేషం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube