వామ్మో.. భారత్ కు వ్యాపించిన మరో చైనా వైరస్!

దేశంలో అడ్డూఅదుపు లేకుండా విజృంభిస్తోన్న కరోనా మహమ్మారి వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు.చైనాలోని వుహాన్ నుంచి వ్యాప్తి చెందిన కరోనా మహమ్మారి దేశంలోని అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపింది.

 Icmr Warns  Of Danger Posed Another Virus Virus From China, Chaina, Icmr, Pune,-TeluguStop.com

ఇప్పట్లో వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడం సాధ్యం కాదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి.అయితే ఇదే సమయంలో భారత్ లోకి మరో కొత్త వైరస్ ప్రవేశించి ప్రజల్లో భయాందోళనను మరింత పెంచుతోంది.

చైనా నుంచి భారత్ లోకి మరో కొత్త వైరస్ ప్రవేశించింది.ఐసీఎంఆర్‌ ఈ కొత్త వైరస్ వల్ల ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తోంది.

పందులు, క్యూలెక్స్ జాతికి చెందిన దోమల ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉంది.పుణెలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ శాస్త్రవేత్తలు, ఐసీఎంఆర్‌ చేసిన పరిశోధనలో దేశంలో 883 మంది శాంపిళ్లను పరీక్షించగా కర్ణాటకకు చెందిన ఇద్దరిలో వైరస్ కు సంబంధించిన యాంటిబాడీలు కనిపిస్తున్నాయి.

ఈ వైరస్ పేరు ‘క్యాట్‌ క్యూ వైరస్‌’ అని సమాచారం.దోమల ద్వారా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో వైరస్ కరోనా కంటే వేగంగా వ్యాప్తి చెందినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

శాస్త్రవేత్తలు మరిన్ని శాంపిల్స్ ను పరిశీలిస్తే మాత్రమే దేశంలో ఇప్పటికి ఎంతమంది కొత్త వైరస్ బారిన పడ్డారనే విషయం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

ఐసీఎంఆర్ సైతం ఈ వైరస్ గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ ఉండటం గమనార్హం.

మనుషులతో పాటు జంతువులపై కూడా కొత్త వైరస్ గురించి పరిశోధనలు చేస్తామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.క్యాట్ క్యూ వైరస్ కూడా కరోనాలా వ్యాప్తి చెందితే మాత్రం దేశంలోని ప్రజల ఆరోగ్యంతో పాటు దేశ ఆర్థిక రంగంపై కూడా తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube