అలాంటి వాళ్ల వల్లే భారత్ లో కరోనా ఎక్కువ వ్యాపిస్తోంది: ఐసీఎంఆర్

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తోంది.రోజురోజుకు వేలల్లో కరోనా కేసులు నమోదవడంతో పాటు వందల మంది ప్రాణాలు బలి తీసుకుంటుంది.

 Irresponsible People Driving Covid-19 Pandemic In India Says Icmr Balram Bhargav-TeluguStop.com

అయితే తాజాగా ఐసీఎంఆర్ దేశంలో కేసుల సంఖ్య పెరగటానికి కారణాలను వెల్లడించింది.దేశంలో పెరుగుతున్న కరోనా కేసులకు కారణం బాధ్యతా రహిత్యమైన వ్యక్తులే కారణమని ఐసీఎంఆర్ డైరెక్టర్ బలరాం భార్గవ్ అన్నారు.

బలరాం భార్గవ్ మాట్లాడుతూ.‘‘దేశంలో కరోనా కేసులు రోజురోజుకీ గణనీయంగా పెరుగుతున్నాయి.అయితే ఈ కేసులు సంఖ్య పెరగటానికి కారణం మనకేం కాదులే అని నిర్లక్ష్యం వహిస్తూ మాస్కులు ధరించకుండా తిరిగే వాళ్ల వల్లేనని పేర్కొన్నారు.బయటకు వచ్చినప్పుడు సామాజిక దూరం పాటించడం మరిచారన్నారు.

వీరి వల్లే కేసులు పెరుగుతున్నాయని అన్నారు.అయితే అందరూ వీళ్లలా కాదని, కొందరూ కరోనాపై అప్రమత్తంగా ఉన్నారని పేర్కొన్నారు.

కోవిడ్ నిబంధనలు అమలు చేస్తూ ఇళ్లలోనే ఉండటం.జాగ్రత్తలు పాటించడం జరుగుతుంది ’’ అని అన్నారు.

Telugu Corona, Coronavirus, Covid, Icmr, India, Masks, Sanitizer, Sanitizers-

ఐసీఎంఆర్ డైరెక్టర్ బలరాం భార్గవ్ చెప్పినట్లు నిజంగానే దేశంలో చాలా మంది కరోనా వైరస్ ను లైట్ గా తీసుకుంటున్నారని తెలుస్తూనే ఉంది.రోధనిరోధక శక్తి ఉంటే వైరస్ దరిచేరదనే భ్రమలో కొందరూ.వచ్చినా 14 రోజుల్లో తగ్గిపోతుందనే భ్రమలో మరికొందరున్నారు.వైరస్ బారిన పడిన చాలా మంది హోం క్వారంటైన్ లో ఉంటూ చికిత్స పొందుతున్నారు.మరికొందరు వైరస్ సోకిన పెద్ద ప్రమాదం లేదని భావిస్తున్నారు.దీంతో ఇష్టానుసారంగా బయటకు తిరుగుతూ వైరస్ వ్యాప్తికి కారకులవుతున్నారు.ప్రస్తుతం దేశంలో 31,67,323 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.58,390 మంది మరణించారు.24,04,585 మంది డిశ్చార్జ్ అవ్వగా.7,04,348 యాక్టివ్ కేసులున్నాయి.ఇక సెప్టెంబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా అన్ లాక్ -4 ప్రక్రియ ప్రారంభం కానుంది.అలాంటి వాళ్ల వల్లే భారత్ లో కరోనా ఎక్కువ వ్యాపిస్తోంది: ఐసీఎంఆర్

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube