77 ఏండ్ల వ‌య‌సులో ఐస్ స్కేటింగ్‌.. అదుర్స్ అంటున్న నెటిజ‌న్లు

నేర్చుకోవాలనే తపన పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమే అని ఇప్పటికే అనేక సార్లు ప్రూవ్ అయింది.ఇదే విషయాన్ని మన పెద్దలు కూడా చెబుతారు.

 Ice Skating At The Age Of 77 .. Netizens Talking About Adurs, Old Man Skating, V-TeluguStop.com

కానీ ఈ విషయాలను గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోరు.హా.మన వల్ల ఏమవుతుందిలే అని దీర్ఘాలు తీసుకుంటూ కాలాన్ని వెళ్లదీస్తారు.కానీ ఇలా కాలాన్ని వృథా చేయడం మంచిది కాదని ఇప్పటికే ఎన్నో సందర్భాల్లో నిరూపితం అయింది.

తాజాగా ఇదే విషయాన్ని ఓ 77 సంవత్సరాల వృద్ధుడు కూడా ప్రూవ్ చేసి చూపించాడు.

రిచర్డ్ ఎప్ స్టీన్ అనే 77 సంవత్సరాల వ్యక్తి రెండేళ్ల నుంచే క్రానిక్ లింఫాటిక్ లుకేమియా అనే భయంకరమైన వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు.

అంతే కాకుండా ఎప్ స్టీన్ కు ఇటీవలే 2020లో స్టేజ్ 4 ప్రోస్టేట్ క్యాన్సర్ బారిన కూడా పడ్డాడు.ఇన్ని రోగాలు ఉన్న వ్యక్తి కృష్ణ రామా అనుకుంటూ మంచానికే పరిమితమవుతాడు.

కానీ రిచర్డ్ మాత్రం అలా ఉండాలని అనుకోలేదు.తనకు ఈ వయసులో ఈ పరిస్థితుల్లో ఐస్ స్కేటింగ్ నేర్చుకోవాలని అనిపించింది.

అనుకున్నదే తడవుగా ఓ ట్రైనర్ ను మాట్లాడుకుని ఆయన కఠోర సాధన చేశాడు.దీంతో అతడికి ఐస్ స్కేటింగ్ వచ్చేసింది.ఇదే విషయాన్ని ఎప్ స్టీన్ కూతురయిన రెబెకా బాస్టియన్ ట్విట్టర్ లో షేర్ చేసుకుంది.77 సంవత్సరాల తన తండ్రి విజయవంతంగా ఐస్ స్కేటింగ్ నేర్చుకున్నాడని చెప్పింది.అంతే కాకుండా తానో సలహా కూడా ఇచ్చింది.జీవితంలో నిత్యం ఏదో ఒకటి నేర్చుకోవాలనే తపన ఉండాలని తెలిపింది.ఆ తపనే లేకపోతే జీవితం వృథా అయిపోతుందని పేర్కొంది.మ‌రి ఇంకా లేటెందుకు.

వైరల్ గా మారిన ఈ 77 సంవత్సరాల వృద్ధుడి స్కేటింగ్ వీడియోను వెంటనే మీరు కూడా చూసేయండి.చూసి మీ కామెంట్ ఏంటో తెలియజేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube