ఐస్ క్రీమ్ 5 రూపాయిలు అంటూ అసలు విషయాన్నీ చెప్పేసిన దీపిక?

‘ఐశ్వర్య’ అనే కన్నడ మూవీతో హీరోయిన్‌గా పరిచయమైన దీపికా పదుకునే….‘ఓం శాంతి ఓం’ మూవీతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు.అనతి కాలంలోనే స్టార్ స్టేటస్ పట్టేసిన దీపికా… ఆ తర్వాత టీమిండియా క్రికెటర్స్ మహేంద్ర సింగ్ ధోనీతో, యువరాజ్ సింగ్‌తో ఆమె ప్రేమాయణం.బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్‌తో డేటింగ్ లాంటి వార్తలతో దేశవ్యాప్తంగా చర్చల్లో నిలిచారు.

 Deepika Padukone Reminds Of Ice Cream In Her School Days,  Deepika Padukone, Ins-TeluguStop.com

చివరకు 2018 సంవత్సరంలో ప్రముఖ నటుడు రణ్‌వీర్ సింగ్‌ను వివాహమాడారు.అప్పటి నుంచి ఈ క్రేజీ జోడీకి సంబంధించిన వార్తలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి.

పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్న ఈ దంపతులు… ప్రస్తుతం ఈ ఇద్దరూ.కపిల్ దేవ్ బయోపిక్ ‘83’లో భార్యాభర్తలుగా నటిస్తుండటం విశేషం.

ఇక వివరాల్లోకి వెళితే… అత్యంత ప్రజాదరణ పొందిన నటుల్లో దీపికా పదుకొనే ఒకరు.రామ్‌లీలా, పద్మావత్‌, ఛపాక్‌, పీకూ వంటి చిత్రాల్లో తన నటనతో అభిమానుల హృదయాలను కొల్లగొట్టారు దీపికా.

ఆమె నటనా కౌశలానికి, ఫ్యాషన్‌కు, బలమైన వ్యక్తిత్వానికి చాలా మంది ఫ్యాన్స్‌ ఉంటారు.అంతే కాకుండా ఈమె… సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ నెటిజన్లను అలరిస్తుంటారు.ఎప్పటికప్పుడు వివిధ రకాల విషయాలను సరదాగా పంచుకుంటూ ఉంటారు.భర్త రణ్‌వీర్ సింగ్‌ను ఆటపట్టించడం, రోజువారీగా సాగే విషయాలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తుంటారు.

ఇప్పటికే .ఈమెకు ఇన్‌స్టాలో 60లక్షలకు పైగా మంది ఫాలోవర్స్‌ ఉన్నారు.

Telugu Deepika Cream, Deepikapadukone, Cream, Ram Leela, Ranveer Singh-Movie

తాజాగా దీపికా ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీల్లో క్వశ్చన్‌ అండ్‌ ఆన్సర్‌ సెషన్‌ను నిర్వహించారు.ఈ క్రమంలో ‘ఐస్‌క్రీమ్‌’ అనే పదానికి దీపికా సమాధానం ఇచ్చారు.‘‘ఐస్‌క్రీమ్‌ను చూస్తే నా స్కూల్‌ డేస్‌ గుర్తొస్తాయి.ప్రతి బుధవారం ఓ వ్యక్తి మా స్కూల్‌ దగ్గర ఐస్‌క్రీమ్‌ అమ్మేవారు.వెనిలా, స్ట్రాబెరీలను రూ.5 ఇచ్చి కొనుక్కొనే దాన్ని’’ అని రాసుకొచ్చారు.అంతేకాకుండా కళ్లు, విలువైనవి, సాంగ్‌ వంటి ఇతర పదాలకు … ఆమె తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు గుర్తు చేసుకుంటూ అదిరిపోయే సమాధానం ఇచ్చారు.దీని వీక్షించిన అభిమానులు.

దీపికా ఇచ్చిన సమాధానాలకు ఫిదా అవుతున్నారు.కాగా ఈ సెషన్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రస్తుతం వినోదాత్మకంగా సాగుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube