వరల్డ్ కప్ వేడి ఇంకా తగ్గలేదు! ఐసిసిపై అమితాబచ్చన్ ఆసక్తికర ట్వీట్  

Amitabh Bachchan Mocks Icc\'s Boundary Rule-

ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ సూపర్ ఓవర్ తర్వాత ఊహించని రీతిలో ఓడిపోవడం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.న్యూజిలాండ్ గొప్పగా ఆడినా కూడా ఎంపైర్ ల తప్పిదం కారణంగా, అలాగే దురదృష్టం కొద్ది కప్ చేజార్చుకుంది.అయితే ఈ విషయంలో ఇప్పుడు ప్రపంచంలో ప్రతి క్రికెట్ అభిమాని న్యూజిలాండ్ పక్షాన నిలబడుతున్నారు..

Amitabh Bachchan Mocks Icc\'s Boundary Rule--Amitabh Bachchan Mocks ICC's Boundary Rule-

బౌండరీలతో ఇంగ్లాండ్ గెలుపుని నిర్ణయించడం సరైన నిర్ణయం కాదని విమర్శలు చేస్తున్నారు.తక్షణం ఐసిసి తన నిర్ణయాలు మార్చుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా ఈ వివాదంపై అమితాబచ్చన్ తనదైన శైలిలో వ్యంగ్యంగా ఐసిసిపై పంచ్ లు వేసారు.

నా దగ్గర రెండు వేల నోటుఉంటే.మీ దగ్గర నాలుగు ఐదు వందల నోట్లు ఉంటే మీ లెక్క ప్రకారం మీరే గొప్ప కదా.

అంటూ ఐసీసీ పై బిగ్ బీ అమితాబ్ సెటైర్లు వేశారు.మరి మీద దగ్గర రెండు వేలు ఉన్నప్పుడు నా దగ్గర నాలుగు వేలు ఉంటే ఎవరు గొప్ప అంటూ ప్రశ్నించారు.ఇప్పుడు ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరో వైపు ఐసీసీ రూల్స్‌పై బాలీవుడ్‌ విలక్షణ నటుడు పరేష్‌ రావల్‌ సైతం ఘాటైన కౌంటర్‌ ఇచ్చారు.‘ఎంఎస్‌ ధోని గ్లౌవ్స్‌ మార్చాలంటూ గగ్గోలు చేసిన ఐసీసీ, ముందు సూపర్‌ ఓవర్‌ రూల్స్‌ మార్చుకుంటే బాగుంటుంది అని చురకలంటించారు.