బీసీసీఐకి ఐసీసీ టైం లైన్..!

పురుషుల టీ20 వరల్డ్ కప్ మరికొద్ది రోజుల్లో శుభారంభం కానుంది.తొలత ఒమన్ దేశంలో టీ20 వరల్డ్ కప్ క్వాలిఫైయర్ మ్యాచ్‌లు జరుగుతాయి.

 Icc Timeline For Bcci ..! Bcci, Icc, International Cricket, Time Line, Sports Up-TeluguStop.com

అనంతరం 12 సూపర్ రౌండ్ల మ్యాచ్‌లు నిర్వహిస్తారు.అయితే మరో నాలుగు రోజుల్లో వరల్డ్ కప్ ప్రారంభం కానున్న వేళ ఐసీసీ కీలక ఆదేశాలు జారీ చేసింది.

ఈ టోర్నమెంట్ లో పాల్గొనే దేశాలన్నీ కూడా తమ ఆటగాళ్లు, వారి సహాయకులు, కోచింగ్, ఇతరత్రా సిబ్బందికి సంబంధించిన వివరాలు తెలియజేయాల్సిందిగా ఐసీసీ ఆదేశించింది.ఇందుకుగాను ఈ నెల 23న చివరి గడువుగా నిర్ణయించింది.

దీంతో ఇప్పటికే దాదాపు అన్ని దేశాలు తమ క్రికెట్ జట్టు వివరాలను ఐసీసీకి పంపించాయి.

అయితే ఆల్రెడీ అందించిన జట్టు వివరాల్లో ఏమైనా మార్పులు చేయదలుచుకుంటే అక్టోబర్ 10 లోపు సంప్రదించాల్సిందిగా సూచించింది.

ఈ క్రమంలో తాజాగా పాకిస్థాన్ వంటి కొన్ని దేశాల క్రికెట్ బోర్డులు తమ క్రికెట్ జట్టులలో కొన్ని మార్పులు చేయాల్సిందిగా కోరగా ఐసీసీ అందుకు అంగీకరించింది.దీంతో మొదటిగా ఇచ్చిన ఆటగాళ్ల పేర్లు ఇప్పుడు మారిపోయాయి.

భారత క్రికెట్ బోర్డు కూడా మార్పులు చేర్పులు చేయనున్నట్టు వార్తలు వచ్చాయి.కానీ ప్రస్తుతానికైతే నెట్ బౌలర్ గా కేవలం ఉమ్రాన్ మాలిక్ ను మాత్రమే తీసుకున్నట్లు టీమిండియా ప్రకటించింది.

మిగతా మార్పుల కోసం వారం రోజులు గడువు ఇవ్వాల్సిందిగా బీసీసీఐ ఐసీసీని కోరింది.

Telugu Bcci, Latest, Ups, Time Line-Latest News - Telugu

ప్రస్తుతం భారత ఆటగాళ్లు ఐపీఎల్ మ్యాచ్‌లతో బిజీగా ఉన్నారని అందుకే తమకు కొంచెం సమయం ఇవ్వాలని బీసీసీఐ అభ్యర్థించింది. దీంతో బీసీసీఐ కోరిక మేరకు ఐసీసీ ఏడు రోజుల పాటు సమయం ఇస్తున్నట్లు ఒక టైం లైన్ ప్రకటించింది.దాని ప్రకారం భారత్ ఇప్పుడు అక్టోబర్ 16 లోపు మార్పులు చేయాల్సి వస్తోంది.

అయితే ఈ మార్పులు చేసుకునే అర్హత సూపర్ 12 జట్లకు మాత్రమే ఉంటుందని ఐసీసీ స్పష్టం చేసింది.ఎవరైనా గాయపడితే తప్ప జట్టులో ఎలాంటి మార్పు ఉండదని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube