ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్: టాప్‌ ర్యాంక్ లను కాపాడుకున్న కోహ్లీ, రోహిత్, బుమ్రా...!

తాజాగా ఇంగ్లాండ్ – ఐర్లాండ్ దేశాల మధ్య జరిగిన వన్డే సిరీస్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ వన్డే ర్యాంకులను విడుదల చేసింది.అయితే భారత క్రికెటర్లు తమ ర్యాంకులను అలాగే నిలబెట్టుకున్నారు.

 Kohli, Rohit And Bumrah In Top Odi Rankings, Virat Kohli, Batsman, Pakistan, Bcc-TeluguStop.com

తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం అత్యుత్తమ వన్డే క్రికెటర్ గా విరాట్ కోహ్లీ మొదటి స్థానంలో కొనసాగుతుండగా, టీమ్ ఇండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ రెండో స్థానంలో కొనసాగుతున్నారు.అలాగే టాప్ బౌలర్ల జాబితాలో భారత స్టార్ బుమ్రా తన రెండో ర్యాంకును నిలబెట్టుకున్నాడు.

బ్యాట్స్ మాన్ విభాగంలో విరాట్ కోహ్లీ 871 రేటింగ్ పాయింట్లను కలిగి ఉండగా, రోహిత్ శర్మ 857 పాయింట్లతో కొనసాగుతున్నారు.వీరిద్దరి తర్వాత పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ బాబర్ ఆజమ్ 829 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.

ఇక మరోవైపు బౌలర్ల విషయానికి వస్తే… న్యూజిలాండ్ స్టార్ పేసర్ ట్రెండ్ గోల్డ్ 722 పాయింట్లతో తన టాప్ ర్యాంకును కాపాడుకున్నారు.అయితే కేవలం మూడు పాయింట్లు వ్యత్యాసంతో టీమిండియా స్టార్ బౌలర్ బూమ్రా రెండో స్థానంలో నిలిచాడు.

ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ యువ సంచలనం ఆటగాడు ముజిబూర్ రెహమాన్ 701 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.ఇక మరోవైపు ఆల్ రౌండర్స్ విషయానికి వస్తే టాప్ 10 మందిలో భారతదేశం నుండి కేవలం రవీంద్ర జడేజా మాత్రమే ఎనిమిదో స్థానాన్ని సంపాదించుకున్నాడు.

ఇక ఆల్ రౌండర్ విభాగంలో 301 పాయింట్లతో ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు మహమ్మద్ నబి నిలిచాడు.అలాగే రెండో స్థానంలో 285 పాయింట్లతో ఇంగ్లాండ్ ఆటగాడు బెన్ స్టోక్స్ ఉండగా, 278 పాయింట్లతో పాకిస్థాన్ ఆటగాడు వసీం మూడో స్థానంలో కొనసాగుతున్నారు.

ఇక టీం ప్రకారం చూస్తే… 127 పాయింట్లతో ఇంగ్లాండ్ మొదటి స్థానంలో కొనసాగుతుండగా, టీమిండియా 119 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది.ఆ తర్వాత న్యూజిలాండ్ మూడో స్థానంలో ఉండగా… సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి.

తాజాగా ఇంగ్లాండ్ – ఐర్లాండ్ సిరీస్ లో 2 – 1 తో ఇంగ్లాండ్ సిరీస్ ను కైవసం చేసుకుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube