అక్కడ ఆడవాళ్లే అంపైర్లు… ICC విప్లవాత్మక ఆలోచన!

నేడు ఆడవాళ్లు అన్ని రంగాలలో సత్తా చాటుతున్నారు అనడానికి తాజాగా గెలిచిన అండర్ 19 వరల్డ్ కప్ ఓ కారణం అని చెప్పుకోవచ్చు.మహిళల అభ్యున్నతిని కాంక్షించే వారెవరైనా వారిని అన్నిరంగాల్లో ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా వుంది.

 అక్కడ ఆడవాళ్లే అంపైర్లు… Icc వ-TeluguStop.com

ఈ నేపథ్యంలో తాజాగా ICC ఆ దిశగా కీలక ముందడుగు వేసింది.అవును, పురుషుల క్రికెట్ తో పాటు సమానంగా ఎదుగుతున్న మహిళల క్రికెట్లో త్వరలో నిర్వహించబోతున్న ICC మహిళల T20 ప్రపంచకప్ లో ఇకనుండి ఒక్క పురుష అంపైర్ కూడా మీకు కనబడడు.

మొత్తం మహిళలే అంపైరింగ్ చేయనున్నారు.

ఈనెల 10 నుండి స్టార్ట్ కాబోతున్న ఈ టోర్నీ విషయమై ICC తాజాగా అంపైర్ల ప్యానెల్ ను ప్రకటించింది.

మ్యాచ్ లను సజావుగా నిర్వహించేందుకు అంపైర్లు కీలక పాత్ర పోషిస్తారన్న విషయం మనందరికీ తెలిసిందే.అయితే ఈ సారి ప్రపంచకప్ లో మ్యాచ్ లో ఆన్ ఫీల్డ్ అంపైర్లతో పాటు మ్యాచ్ రిఫరీలు కూడా మహిళలే కావడం హర్షించదగ్గ విషయం.

ఈ మేరకు ICC 13 మందితో కూడిన అంపైర్ల ప్యానెల్ ను ప్రకటించింది.వీరిలో 10 మంది ఆన్ ఫీల్డ్ అంపైర్లు కాగా ముగ్గురు మ్యాచ్ రిఫరీలు.

Telugu Womens Cup, Cotton, Cricket, Gs Lakshmi, Harris, Janani, Nirmali Perera-S

ఇకపోతే ఈ జాబితాలో ముగ్గురు భారత్ మహిళకు కావడం గమనార్హం.ఈ టోర్నీలో భాగంగా జరిగే తొలి మ్యాచ్ (సౌతాఫ్రికా – శ్రీలంక) కు హరీస్, కాటన్ లు ఆన్ ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరిస్తారు.ఇక ICC తీసుకున్న ఈ నిర్ణయంపై మహిళల క్రికెట్ ను మరింత ముందుకు తీసుకెళ్లడంలో ఇది కీలక ముందడుగు అని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.

మ్యాచ్ రిఫరీలు:

1.GS లక్ష్మీ – ఇండియా
2.షాండ్ర్ ఫ్రిట్జ్ – సౌతాఫ్రికా
3.మిచెల్ పెరేరియా – శ్రీలంక

Telugu Womens Cup, Cotton, Cricket, Gs Lakshmi, Harris, Janani, Nirmali Perera-S

ఆన్ ఫీల్డ్, TV అంపైర్లు:

1.సూ రెడ్‌ఫర్న్ – ఇంగ్లాండ్
2.షెరిడాన్ – ఆస్ట్రేలియా
3.క్లేయిర్ పొలొసొక్ – ఆస్ట్రేలియా
4.జాక్వలిన్ విలియమ్స్ – వెస్టిండీస్
5.కిమ్ కాటన్ – న్యూజిలాండ్
6.లారెన్ – సౌతాఫ్రికా
7.అన్నా హరీస్ – ఇంగ్లాండ్
8.వృందా రతి – ఇండియా
9.ఎన్.జనని – ఇండియా
10.నిర్మలి పెరెరా – శ్రీలంక

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube