ఇకపై మరింత సులువుగా యూఏఈ రెసిడెన్సీ పర్మిట్...!!

ఓ విదేశీయుడు ఏదన్నా విదేశాలలో ఉండాలంటే ఆయా దేశాల నిర్ణయాల ప్రకారం అక్కడ నివసించేందుకు, లేదా అక్కడ పనిచేసేందుకు తప్పకుండా అనుమతి పత్రాలు తీసుకోవాలి.అమెరికా వెళ్ళే వారు వర్క్ పర్మిట్, హెచ్1-బి వీసాలకు ఎలా అప్ప్లై చేసుకుంటారో అలానే యూఏఈ వెళ్ళే వారు తప్పకుండా యూఏఈ రెసిడెన్సీ పర్మిట్ అనేది తీసుకోవాలి.

 Uae Residence Permit : Ica Uae Smart Application, Ica Smart Services, Ica Uae S-TeluguStop.com

యూఏఈ లో ఉండేందుకు తీసుకునే అనుమతి పత్రం లాంటిది ఇది.ఇవి తాత్కాలికంగా లేదా శాశ్వతంగా ఉండేందుకు ఓ సాధనాలు మాత్రమే.ఇవి ఎప్పుడు ఒకేలా ఉండవు కాలానికి అనుగుణంగా మారుతూ ఉంటాయి.ఇదిలాఉంటే

యూఏఈ వెళ్ళాలనుకునే వారు రెసిడెన్సీ పర్మిట్ల కోసం ప్రత్యేకంగా ఐఏసి కేంద్రాలకు వెళ్లి అప్ప్లై చేసుకునే వారు దీనికి ఎంతో సమయం పట్టేది.

అయితే ఇకపై ఎవరూ కూడా ఐఏసి కేంద్రాలకు వెళ్ళే అవసరం లేదని నేరుగా ఇంట్లో కూర్చునే యూఏఈ రెసిడెన్సీ కు అప్ప్లై చేయచ్చని తెలిపింది.ఇందులో భాగంగానే ఫెడరల్ అధారిటీ ఫర్ ఐడెంటిటి అండ్ నేషనల్ ఓ అప్లికేషన్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది…

“ ICA UAE SMART “ పేరుతో వచ్చిన ఈ అప్లికేషన్ ను స్మార్ట్ ఫోన్ ఆధారంగా ఉపయోగించవచ్చని ప్రకటించింది.

స్మార్ట్ ఫోన్ ద్వారాకాకపోయినా అధికారిక వెబ్సైటు అయిన “ ica.gov.ae” ద్వారా కూడా దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపింది.ఈ దరఖాస్తు మొత్తం ఆరు దశలలో జరుగుతుందని, యాప్ లేదా వెబ్సైట్ల ద్వారా ప్రాధమిక వివాలను రిజిస్టర్ చేయాలి, ఆ తరువాత అన్ని వివరాలు సరిచూసుకుని రెసిడెన్సీ పర్మిట్ ఆప్క్షన్ ను ఎంచుకోవాలి.

వారు అడిగిన సమాచారం తో పాటుగా ధృవీకరణ పత్రాలను అప్లోడ్ చేయాలి.తరువాత ఫీజు చెల్లించగానే అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.ఆ తరువాత దరఖాస్తు ప్రాసెస్ అయ్యి పర్మిట్ వస్తుంది.పర్మిట్ రాగానే పాస్ పోర్టు ను సంభందిత అధికారులకు ఇస్తే రిజిస్టర్ వివరాలు చెక్ చేసుకుని దానిపై పర్మిట్ ముద్ర వేసి ఇస్తారు.

అంతేకాదు వర్క్ పర్మిట్లను ఇదే రీతిలో జారీ చేయడానికి యూఏఈ కార్మిక శాఖ కసరత్తులు చేస్తోందట.అదే జరిగితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇంట్లో కూర్చుని ఆన్లైన్ లోనే సేవలు పొందవచ్చు అంటున్నారు పరిశీలకులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube