ఐబీ ఆఫీసర్ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో దిగ్బ్రాంతి కలిగించే విషయాలు  

Ib Officer Ankit Sharma Killed Horribly, Post Mortam Report Said - Telugu Ankit Sharma, Delhi, Ib Officer, Post Mortam Report, అంకిత్ శర్మ

ఇటీవల ఈశాన్య ఢిల్లీ లో చోటుచేసుకున్న హింస ఘటనలలో దాదాపు 32 మంది పైగా మృతి చెందిన సంగతి తెలిసిందే.అయితే ఈ అల్లర్ల లో భాగంగా ఇంటలీజెన్స్ బ్యూరో ఆఫీసర్ అంకిత్ శర్మ మృతదేహం డ్రైనేజీ లో నుంచి వెలికితీసిన విషయం విదితమే.

Ib Officer Ankit Sharma Killed Horribly, Post Mortam Report Said

అయితే ఐబీ ఆఫీసర్ ను అత్యంత దారుణంగా హత్య చేసినట్లు తాజాగా ఆయన మృతదేహానికి జరిపిన పోస్ట్ మార్టం నివేదికలో వెల్లడైంది.అయితే అంకిత్ శర్మ మృతదేహం ఆప్ నేత,కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్ ఇంటి వద్ద ఉన్న డ్రైనేజీ లో దొరకడం తో ఆయనపై ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి.

అంతేకాకుండా ఆయనకు సంబందించిన భవనం పై నుంచి పలువురు అల్లరి మూకలు రాళ్లు,యాసిడ్ వంటి వాటిని విసిరారని,ఆ సమయంలో తాహిర్ కూడా అక్కడే ఉన్నట్లు సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తున్న కొన్ని వీడియోల ద్వారా వెల్లడవుతుంది.దీనితో అంకిత్ శర్మ మృతికి తాహిర్ బాధ్యత వహించాలి అంటూ అంకిత్ శర్మ కుటుంబ సభ్యులు డిమాండ్ చేయడం తో ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది.

ఈ క్రమంలోనే ఆప్ పార్టీ కూడా దిద్దుబాటు చర్యలు చేపట్టి, తాహిర్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.అయితే తాజా పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఒళ్లు గగ్గురుపొడిచే వాస్తవాలు వెల్లడించారు వైద్యులు.

ఒక్కసారిగా చంపలేదు అని నిదానంగా ఆగిఆగి ఒక్కొక్క పోటు పొడుస్తూ ఆరుగంటల పాటు నరకం చూపారు అంటూ వైద్యులు తమ నివేదికలో వెల్లడించారు.మొత్తం ఆయన శరీరంలో 400 సార్లు పొడిచి,పొడిచి పేగులు సైతం బయటకు లాగి ఆపై మృతదేహాన్ని మరుగు కాల్వలో పడేసినట్లు వైద్యులు వెల్లడించారు.

Telugu Ankit Sharma, Delhi, Ib Officer, Post Mortam Report, అంకిత్ శర్మ-

అతడి శరీరంలో ఒక్క అవయవాన్ని కూడా వదలకుండా అన్ని భాగాలపైనా కత్తితో పొడిచారని వైద్యులు నివేదిక లో పేర్కొన్నారు.నాలుగు నుంచి ఆరు గంటలపాటు.

కనీసం ఆరుగురు వ్యక్తులు ఈ దుర్మార్గాన్ని కొనసాగించి ఉంటారని వివరించారు.తమ జీవితంలో ఇప్పటివరకూ ఇంత దారుణమైన పీడకలలాంటి అవయవఛేదాన్ని (మ్యుటిలేషన్‌) చూడలేదంటూ నివేదికలో పేర్కొన్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ib Officer Ankit Sharma Killed Horribly, Post Mortam Report Said Related Telugu News,Photos/Pics,Images..

footer-test