వైరల్‌ : పెళ్లయిన వ్యక్తితో సంబంధం పెట్టుకున్న మహిళకు కోర్టు వింత శిక్ష

ఆయన ఒక ఐఏఎస్‌ అధికారి.సమాజంను ఉద్దరించాల్సిన బాధ్యత ఆయనపై ఉంది.

 Iasillegalafirewith Model And His Wife Went To Manipurcourt Modelgetpunishment-TeluguStop.com

నలుగురికి ఆదర్శంగా ఉండి అందరి బాగోగులు చూసుకోవాల్సి ఉంటుంది.కాని ఆయన తన కుటుంబ సభ్యుల విషయంలోనే బాధ్యత యుతంగా ప్రవర్తించలేదు.

పెళ్లి చేసుకున్న భార్యను మరియు తనకు పుట్టిన ముగ్గురు పిల్లలను పట్టించుకోకుండా ఒక మోడల్‌ ప్రేమలో పడి, ఆమెను రెండవ పెళ్లి చేసుకునే వరకు వెళ్లాడు.మొదటి భార్యకు ఈ విషయం తెలియడంతో కోర్టుకు వెళ్లింది.

కోర్టు ఆ ఐఏఎస్‌ అధికారికి మరియు ఆయన లవర్‌కు కూడా వింతైన శిక్షను వేసింది.ఈ తీర్పు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వైరల్‌ అవుతోంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే… మణిపూర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి శ్యామ్‌ సుందర్‌ సింగ్‌తో 2009వ సంవత్సరంలో డాక్టర్‌ రంజితా అంకోమ్‌ వివాహం అయ్యింది.వీరికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు.

సంతోషంగా వీరి సంసారం సాగుతుందనుకుంటున్న సమయంలో మూడు సంవత్సరాల క్రితం శ్యామ్‌ సుందర్‌ కి మోడల్‌ పునితో పరిచయం ఏర్పడింది.ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి ఇద్దరి వివాహేతర సంబంధానికి దారి తీసింది.

ఇద్దరు కూడా వదిలి ఉండలేని పరిస్థితికి వచ్చారు.దాంతో ఆమెను సాంప్రదాయబద్దంగా శ్యామ్‌ సుందర్‌ రెండవ వివాహం చేసుకున్నాడు.

అయితే ఆ వివాహంను రిజిస్ట్రర్‌ చేయించుకోలేదు.
శ్యామ్‌, పురిల వివాహేతర సంబంధం గురించి తెలిసిన రంజితా కోర్టును ఆశ్రయించింది.

కోర్టు ఈ కేసును సుదీర్ఘంగా విచారించింది.ఎట్టకేలకు తీర్పు ఇచ్చింది.

శ్యామ్‌, పురిలు రిజిస్ట్రర్‌ మ్యారేజ్‌ చేసుకోలేదు కనుక వారి వివాహం చెల్లదు.వారి బందంను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించింది.

ఇదే సమయంలో ఒక మహిళ పరువు తీయడంతో పాటు ఆమె కుటుంబంను నాశనం చేసేందుకు ప్రయత్నించినందుకు గాను పురికి 70 లక్షల రూపాయల నష్టపరిహారం విధించింది.

Telugu Ias Afire, Puni, Ranjitha Ankom, Telugu Ups-

  రంజిత కోరుకున్నట్లుగా విడాకులు ఇచ్చేందుకు నిరాకరించింది.శ్యామ్‌ వివాహేతర సంబంధంకు స్వస్థి చెప్తాడని, పిల్లల కోసం కలిసి ఉండాలంటూ కోర్టు సూచించింది.ఆ తర్వాత కూడా అలాగే పరిస్థితి కొనసాగితే అప్పుడు చర్యలు తీసుకుంటాం అంటూ కోర్టు చెప్పింది.

అయితే రంజితా మాత్రం విడాకులు ఇప్పించి 10 కోట్ల రూపాయలు భరణం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తోంది.నా పిల్లలను నేను చూసుకుంటానంటూ ఆమె నమ్మకంగా చెబుతుంది.కోర్టు మాత్రం అంత త్వరగా విడిపోవాలనుకోవడం మంచిది కాదని వారికి సూచిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube