ఐదుసార్లు ఫెయిల్.. ఆరో ప్రయత్నంలో ఐఏఎస్.. లక్ష్యాన్ని సాధించిన శివనారాయణ సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

ఐఏఎస్ సాధించాలంటే ఎంతో కష్టపడాలి.రేయింబవళ్లు తీవ్రంగా శ్రమిస్తే మాత్రమే ఐఏఎస్ కావడం సాధ్యమవుతుంది.

శివనారాయణ శర్మ( Sivanarayana Sharma ) ఐదుసార్లు ఐఏఎస్ సాధించే ప్రయత్నంలో ఫెయిలైనా ఆరో ప్రయత్నంలో లక్ష్యాన్ని సాధించారు.ప్రస్తుతం ఆదోని సబ్ కలెక్టర్ గా పని చేస్తున్న శివనారాయణ సక్సెస్ స్టోరీ ఎంతగానో ఆకట్టుకుంటోంది.

సమాజంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను గమనించిన శివనారాయణ ఐఏఎస్ లక్ష్యంగా చేసుకుని తన కలను నెరవేర్చుకున్నారు.యూపీలోని మధురకు( Mathura in UP ) చెందిన తల్లీదండ్రుల కష్టాలను గమనించి ఒకవైపు సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తూనే మరోవైపు సివిల్స్ పై దృష్టి పెట్టారు.ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో బీటెక్ పూర్తి చేసిన శివనారాయణ 2013లో సాఫ్ట్ వేర్ డెవలపర్ జాబ్ సాధించాడు.2018 వరకు సాఫ్ట్ వేర్ జాబ్ చేసిన శివనారాయణ ఐఏఎస్ అయితే ప్రజలకు నేరుగా సేవ చేయవచ్చని ఫీలయ్యారు.ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని శివనారాయణ చెప్పుకొచ్చారు.

ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని ఆయన తెలిపారు.బాధితులు ఎవరైనా సబ్ కలెక్టర్ కార్యాలయానికి వస్తే సమస్యలు చెప్పుకునే అవకాశం కల్పిస్తానని శివనారాయణ కామెంట్లు చేశారు.శివనారాయణ లక్ష్యాన్ని సాధించడంలో తల్లీదండ్రుల కృషి ఎంతో ఉంది.

Advertisement

నాలుగు, ఐదు ప్రయత్నాల్లో ఉత్తీర్ణత సాధించినా కోరుకున్న ర్యాంక్ అయితే రాలేదు.

2021 సంవత్సరంలో శివనారాయణ ఎంతో కష్టపడి లక్ష్యాన్ని సాధించారు.ముస్సోరిలో ఏడాది పాటు ట్రైనింగ్ తీసుకున్న శివనారాయణ గుంటూరులో శిక్షణ సహాయ కలెక్టర్ గా విధులను నిర్వహించారు.లక్ష్యం నిర్దేశించుకుని తపన, పట్టుదలతో కష్టపడితే సక్సెస్ కావచ్చని ఆయన తెలిపారు.

శివనారాయణ రాబోయే రోజుల్లో కెరీర్ పరంగా మరింత ఎదిగి ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ ప్రశంసలు అందుకోవాలని నెటిజన్లు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు తెగ వైరల్ అవుతున్నాయి.

వైరల్ వీడియో : పాఠాలు వింటూనే గుండెపోటుకు గురైన చిన్నారి.. చివరకి?
Advertisement

తాజా వార్తలు