తెలంగాణ‌లో ముంద‌స్తు... వ‌స్తే దానికంటే ముందే బ‌దిలీలు తెలిసిందేగా..?

ఎన్నికలు అంటే చాలు కేసీఆర్ వ్యవహరించే తీరు వేరుగా ఉంటుంది.సాధారణంగా ఫామ్‌హౌస్‌కే పరిమితం అయ్యే కేసీఆర్ ఎన్నికలు వస్తున్నాయంటే చాలు ప్రగతి భవన్‌కు వచ్చి మీటింగుల మీదు మీటింగులు నిర్వహిస్తుంటారు.

 Ias Officers Transfers Before Early Elections In Telangana Details,  Kcr, Trs Pa-TeluguStop.com

అంతేకాకుండా అధికారులను కూడా బదిలీ చేసేస్తుంటారు.తెలంగాణలో తాజాగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు ముందస్తు ఎన్నికలు జరగబోతున్నాయనే సంకేతాలను ఇస్తున్నట్లే కనిపిస్తోంది.

2018లో కూడా సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లి రాజకీయంగా తనదైన వ్యూహాలతో ప్రతిపక్షాలను బోల్తా కొట్టించారు.ముఖ్యంగా 2018లో జరిగిన ముందస్తు ఎన్నికలకు ముందు భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేశారు.

దాదాపు 50 మందికి పైగా ఐపీఎస్ అధికారులను అప్పట్లో కేసీఆర్ బదిలీ చేయడం చర్చనీయాంశంగా మారింది.అయితే ఇప్పుడు కూడా భారీ ఎత్తున ఐఏఎస్ అధికారులను బదిలీ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

రెండు వారాల నుంచి ఎర్రవల్లి ఫామ్‌ హౌస్‌లో ఐఏఎస్ అధికారుల బదిలీలపై సీఎం కేసీఆర్ తీవ్ర కసరత్తు చేసినట్లు తెలుస్తోంది.

Telugu Amit Sha, Cm Kcr, Iasofficers, Modi, Telangana, Telanganaias, Transfers,

తమకు అనుకూలమైన ఐఏఎస్ అధికారులు ఎవరు? ఇతరుల పట్ల ఆసక్తి చూపే వారు ఎవరు? అన్న అంశంపై కేసీఆర్ టీఆర్ఎస్ సీనియర్ నేతలతో చర్చించినట్లు సమాచారం అందుతోంది.దీనికి సంబంధించిన సమాచారం కోసం నిఘా వర్గాలు ఇచ్చే నివేదికను కేసీఆర్ ఆధారంగా చేసుకుంటున్నారట.ఇదంతా ముందస్తు ఎన్నికల కోసమే అని టీఆర్ఎస్ నేతల్లో కూడా చర్చ నడుస్తోంది.

Telugu Amit Sha, Cm Kcr, Iasofficers, Modi, Telangana, Telanganaias, Transfers,

రానున్న రోజుల్లో తెలంగాణలో భారీ ఎత్తున ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగితే ముందస్తు ఎన్నికలు ఖాయం అని రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు.అయితే ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తే తెలంగాణలో ముందస్తు కోసం కేసీఆర్ సిద్ధపడకపోవచ్చు అనే టాక్ కూడా వినిపిస్తోంది.రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికలు అంటే మీడియా ఫోకస్ ఉండదని కేసీఆర్ భావిస్తున్నారట.అటు ఇటీవల మంత్రి తలసాని కూడా ముందస్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు.

కేంద్రంలో మోదీ, అమిత్ షా తమ ప్రభుత్వాన్ని రద్దు చేసుకుని ముందస్తుకు వెళితే.తాము కూడా ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని సంకేతాలు ఇచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube