IAS లు ఉద్యోగంలో చేరినప్పటి నుండి రిటైర్ అయ్యే వ‌ర‌కు ఎంత వేతనాలు తీసుకుంటారో తెలుసా…?

నేటి యువత లో చాలామందికి ఐఏఎస్ అవ్వాలని కోరిక.ఐఏఎస్ ఉద్యోగానికి ఎంపిక అవ్వడం అంటే సర్వ సాధారణమైన విషయం కాదు.

 Ias Officers Salaries Details-TeluguStop.com

ఇలాంటి ఉద్యోగం సొంతం చేసుకోవాలి అంటే ఎంతో కృషి, పట్టుదల ఉంటేనే అది సొంతమవుతుంది.ఇలాంటి అదృష్టం నూటికో, కోటికో ఎవరికో ఒకరికి మాత్రమే ఉంటుంది.

చాలా మంది కూడా ఐదారు సార్లు యూపీఎస్సీ ఎగ్జామ్ రాసి ఐఏఎస్ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు.ప్రతి సంవత్సరం కొన్ని లక్షలమంది యుపిఎస్ పరీక్ష రాసి ఐఏఎస్ అవ్వాలని ఎదురు చూపులు చూస్తూ ఉంటారు.

అందులో కేవలం 80 – 90 మంది మాత్రమే ఎంపిక కావడం జరుగుతుంది.ఇక భారతదేశంలో అత్యంత కఠినమైన పరీక్షలను యుపిఎస్ పరీక్ష ఒకటి.

ఇక ఈ పరీక్ష రాసి ఐఏఎస్ అయితే, చాలు వారి జీవితమే మొత్తం మలుపు తిరుగుతుంది.ఎప్పటికి అప్పుడు వేతనాలు పెరుగుదలతో పాటు ప్రమోషన్లు లభిస్తాయి.దింతో వారి జీవితం అంతా కూడా సాఫీగా కొనసాగుతుంది.ఈ తరుణంలోనే ఒక అభ్యర్థి ఐఏఎస్ కు ఎంపిక అయ్యినప్పటి నుండి రిటైర్ అయ్యే వరకు ఎంత జీతం సంపాదిస్తాడో, రిటైర్ అయ్యేటప్పుడు ఏ బాధ్యత లో ఉంటాడో అనే వివరాలు ఒక సరి చూద్దామా…

ఐఏఎస్ కెరీర్ ‌లో మొద‌టి సంవ‌త్స‌రం నుంచి 4వ సంవ‌త్స‌రం వ‌ర‌కు ప‌ని చేయాలి.ఇందులో వారికి బేసిక్ పే రూ.56,100 లభిస్తుంది, ఈ సమయలో ఏఎస్‌పీ, ఎస్‌డీఎం, అసిస్టెంట్ క‌మిష‌న‌ర్ హోదాలో పనిచేయాల్సి ఉంటుంది.ఇక ఆ తర్వాత 5వ సంవ‌త్స‌రం నుంచి 8వ సంవ‌త్స‌రం వ‌రకు డిప్యూటీ సెక్రెట‌రీ, అండ‌ర్ సెక్రెట‌రీ పోస్టులలో ప‌నిచేయాల్సి ఉంటుంది.ఇక ఆ సమయంలో రూ.67,700 జీతం అందుకుంటారు .ఇలా వారి పదవి కలం అనుసరించి జీతం పెరగడం, అలాగే ప్రమోషన్స్ ఇస్తారు.ఇక వారి కెరీర్‌లో 34వ‌ ఏడాది నుంచి 36వ ఏడాది వ‌ర‌కు పని చేస్తే చీఫ్ సెక్రెట‌రీగా పదివి పొందుతూ రూ.2.25 ల‌క్ష‌ల వేత‌నం పొందుతారు.అలాగే 37 ఏళ్ల‌కు పైగా కెరీర్ ఉన్న‌వారికి క్యాబినెట్ సెక్రెట‌రీ ఆఫ్ ఇండియా పోస్టు ఇవ్వడం జరుగుతుంది.

ఐఏఎస్ జాయిన్ అయ్యే సమయంలో ఇచ్చే డిఎ 0 శాతమే.ఇక సర్వీస్ పెరుగుతున్నకొద్దీ డిఎ ను పెంచుతూ ఇస్తారు.ఇక అంతే కాకుండా ఒక్కోసారి ఐఏఎస్ అధికారులకు ఒకే సమయంలోనే జీతాలు పెరుగుదల ప్రమోషన్లు కూడా లభిస్తుంటాయి.ఐఏఎస్ ప్రారంభదశలోనే వేతనంలో బేసిక్ సాలరీ 33 శాతం ఇంక్రిమెంట్ కూడా ఇస్తారు.

దీనితో పాటు క్యాబినెట్ సెక్రటరీ స్థాయిలో ఫిక్స్డ్ శాలరీ ఉంటుంది వీళ్ళకి.ఇక ఐఎఎస్ అధికారులకు ఎంట్రీ లెవెల్ లో సంవత్సరానికి 0-14 శాతం డిఎ పెంచుతూ వెళ్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube