జగన్ ని కలిసిన 57 మంది ఐఏఎస్ అధికారులు

నిన్న వెలువడిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో వైసీపీ పార్టీ ఘన విజయం సాధించడం తో ఈ నెల 30న ఏపీ నూతన ముఖ్యమంత్రిగా వై సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం ఆయన ఐఏఎస్ అధికారులతో భేటీ అయినట్లు తెలుస్తుంది.23 మంత్రిత్వ శాఖలకు చెందిన 57మంది అధికారులు శుక్రవారం ఉదయం ఆయనను తాడేపల్లి నివాసంలో కలిశారు.ఈ సందర్భంగా ఆయా శాఖల వివరాలను వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి అధికారులు వివరించారు.

 Ias Officers Meet Jagan-TeluguStop.com

మరోవైపు ఎన్నికల్లో విజయం సాధించిన పార్టీ ఎమ్మెల్యేలు, నేతలుతో పాటు అభినందనలు తెలిపేందుకు భారీ సంఖ్య లో అక్కడకి వస్తున్న వారితో ఆ ప్రాంతం అంతా కోలాహలం నెలకొంది.

మరోపక్క సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని సాధించి నూతన ముఖ్యమంత్రి గా ప్రమాణస్వీకారం చేయబోతున్న జగన్ కు కాన్వాయ్ ని కూడా కేటాయించినట్లు తెలుస్తుంది.

ఇప్పటికే ఏపీ పోలీసుశాఖ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌ను కేటాయించగా… ఇప్పుడు ప్రభుత్వం ఆయనకు కాన్వాయ్ కేటాయించింది.జగన్‌ కాన్వాయ్‌ నిమిత్తం ఓ బులెట్‌ ప్రూఫ్‌ వాహనం, మొబైల్‌ సిగ్నల్ జామర్‌, అంబులెన్స్‌, సెక్యూరిటీ సిబ్బంది మరియు వాహనాలను ఏర్పాటు చేశారు.

మొత్తం ఆరు వాహనాల కాన్వాయ్‌కి ‘ఏపీ 18 పీ 3418’ నంబర్‌ను కేటాయించారు అధికారులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube