తెలంగాణా ను వణికిస్తున్న కరోనా,కలెక్టర్ కు సైతం పాజిటివ్

తెలంగాణా రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తుంది.రోజు రోజుకు అక్కడ కేసులు విపరీతంగా పెరిగిపోతుండటం తో అధికారులు ఆందోళన చెందుతున్నారు.

 Ias Officer Swetha Mohanty Tests Corona Positive, Ias Officer Swetha Mohanty ,te-TeluguStop.com

హైదరాబాద్ లోని జీహెచ్ఎంసీ పరిధిలో ప్రతి రోజూ వందలాది కేసులు నమోదవుతూనే ఉన్నాయి.ఈ మహమ్మారి కి పలువురు అధికారులు, ప్రజా ప్రతినిధులు కూడా క్వారంటైన్ లోకి వెళుతున్నారు.

ఒకపక్క రాష్ట్రంలో పెరుగుతున్న కేసులతో పాటు ప్రజా ప్రతినిధులు కూడా ఇలా ఈ మహమ్మారికి గురవుతుండడం మరింత ఆందోళన కలిగిస్తుంది.

తాజాగా జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి కూడా ఈ వైరస్ బారిన పడినట్లు తెలుస్తుంది.

స్వల్ప లక్షణాలతో పరీక్షలు చేయగా ఆమెకు పాజిటివ్ ఉన్నట్లు తెలుస్తుంది.ఇప్పటికే ఆమె కార్యాలయంలో 15 మందికి కరోనా సోకిన విషయం తెలిసిందే.అయితే ఇప్పుడు తాజాగా కలెక్టర్ మహంతి కి కూడా కరోనా పాజిటివ్ రావడం తో పలువురు ఉద్యోగులు కార్యాలయానికి రావాలి అంటేనే భయపడిపోయే పరిస్థితి ఏర్పడింది.ఇప్పటికే కార్యాలయంలో కరోనా సోకిన సిబ్బంది నుంచే మహంతికి కరోనా సోకిఉంటుంది అని వైద్యులు చెబుతున్నారు.

అయితే కలెక్టర్ తో పాటు కారు డ్రైవర్ కి,కంప్యూటర్ ఆపరేటర్ లు కూడా ఈ వైరస్ బారిన పడినట్లు తెలుస్తుంది.

దీంతో వెంటనే కార్యాలయం మూసివేసి శానిటైజేషన్ కూడా చేసినట్లు తెలుస్తుంది.

ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా రోజూ దాదాపు వెయ్యి కేసుల వరకు పాజిటివ్ కేసులు నమోదు అవుతుండగా, గ్రేటర్ హైదరాబాద్ లోనే అత్యధిక కేసులు నమోదు అవుతున్నాయి.ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 40 వేల మేరకు కేసులు నమోదు అయినట్లు తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube