ఆ ఐఏఎస్ అధికారి 24 మార్కులతో పాస్ అయ్యాడట...!

ప్రస్తుత కాలంలో పిల్లల ఎలా చదువుతున్నారు అని తెలుసుకోవాలంటే వారు మార్కులనే చూస్తున్నారు.ఎంత తెలివి ఉంది? వారి సామర్ధ్యం ఏంటి? అనేది ఎవరు చూడటం లేదు వారికి కావాల్సింది మార్కులు.మార్కులు బాగా వచ్చాయి అంటే ప్రయోజకుడు అవుతాడు.లేదు అంటే వేస్ట్ అంటు పిల్లలను వేధిస్తున్నారు.

 Ias Officer,  24 Marks Score Card, Exam Results, Nitin Sangwan-TeluguStop.com

కానీ మార్కులే జీవితం కాదు, మార్కులు వందేళ్ల జీవితాన్ని నిర్ణయించలేవు అంటూ ఓ ఐఏఎస్ అధికారి చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.ఆ ఐఏఎస్ అధికారి ఆలా ఎందుకు ట్విట్ చేశాడంటే ? అతను ఇంటర్ కెమిస్ట్రీలో 24 మార్కులు తెచ్చుకుని జస్ట్ పాస్ అయ్యాడు.అలా అంటూ మార్కుల మెమోను ట్విట్ చేశాడు.

అహ్మదాబాద్ లో డిప్యూటీ మున్సిపల్ కమిషనర్, అహ్మదాబాద్ స్మార్ట సిటీ సీఈఓగా పని చేస్తున్న నితిన్ సంగ్వాన్ రెండు రోజుల క్రితం తన మార్కుల గురించి ఇలా ట్విట్ చేశారు.”సీబీఎస్‌ఈ ఇంటర్‌ పరీక్షల్లో నాకు కెమిస్ట్రీలో 24 మార్కులే వచ్చాయి.పాస్‌ మార్కుల కంటే ఒక్క మార్కు ఎక్కువ వచ్చింది.

అయితే నా జీవితంలో నేను ఏం కావాలనుకుంటున్నానో ఈ మార్కులు నిర్ణయించలేదు.అందుకే మార్కుల భారాన్ని పిల్లల మీద మోపి వారిని బాధ పెట్టకండి.

బోర్డు ఫలితాల కంటే జీవితం చాలా విలువైనది. రిజల్ట్‌ అనేది ఆత్మపరిశీలనకు అవకాశంగా భావించండి.

విమర్శించడానికి కాదు” అంటూ అయన ట్వీట్ చేశాడు.

ఇంకా ఈ ట్విట్ పై న్యూఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సైతం స్పందించారు.”మీరు చాలా మంచి సందేశాన్ని ఇచ్చారు.జీవితంలో గెలుపు, ఓటమిలను పరీక్షలో వచ్చే మార్కులు నిర్ణయించలేవు” అంటూ ట్విట్ చేశారు.

దీంతో ప్రస్తుతం పిల్లలు అంత కూడా ఈ ఐఏఎస్ ఆఫీసర్ ను ఫాలో అవుతూ మా ఇన్ స్పిరేషన్ నువ్వే అంటూ ట్విట్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube