సివిల్స్‌ టాపర్‌ సంచలన నిర్ణయం..! ఎవరు ఊహించని రాజీనామా.! ఫేస్బుక్ పేజీ లో ఏమని పోస్ట్ చేసారంటే.?     2019-01-10   10:05:22  IST  Sai Mallula

సివిల్‌ సర్వీస్‌ పరీక్షలో రాంక్ సాధించటం అంటే మామూలు మాటలు. ఎంతో మంది ఎన్నో కలలు కంటూ కష్టపడుతూ ఉంటారు. అలాంటిది ఎంతో కస్టపడి సివిల్స్ మొదటి రాంక్ సంపాదించి ఐఏఎస్‌ అధికారిగా పదవి చేపట్టిన ఓ ఆఫీసర్ రాజీనామా చేసారు. అలాంటి సంచలన నిర్ణయం ఆయన ఎందుకు తీసుకున్నారో తెలుసా.?

IAS Shah Faesal Resigns From Services To Protest Killings In Kashmir-IAS Officer National Conference Party Protest Kashmir

IAS Shah Faesal Resigns From Services To Protest Killings In Kashmir

వివరాలలోకి వెళ్తే..జమ్మూ కశ్మీర్‌కు చెందిన యువ ఐఏఎస్‌ అధికారి షా ఫజల్‌ బుధవారం తన ఉద్యోగానికి రాజీనామా చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 2009లో జరిగిన సివిల్‌ సర్వీస్‌ పరీక్షలో ఆయన మొదటి ర్యాంకు సాధించారు. ఫస్ట్‌ ర్యాంకు సాధించిన మొదటి కశ్మీరీగా ఆయన చరిత్ర సృష్టించారు. ఐఏఎస్‌ అధికారి అయినప్పటి నుంచి ప్రజల్లో ఉంటూ.. ప్రజల సమస్యలపై నిత్యం స్పందిం చే వారు. కశ్మీర్‌లో జరుగుతున్న నిరంతర హత్యలకు నిరసనగా తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. హత్యలను అరికట్టేందుకు కేంద్రం చర్యలు తీసుకో వట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన రాజీనామాకు గల కారణాలను తన ఫేస్‌బుక్‌ పేజీలో రాశారు.

35 ఏళ్ల ఫజల్ జమ్ము కశ్మీర్ ప్రజలపై ప్రభుత్వం సైన్యంతో కృత్రిమ దాడులకు పాల్పడుతుందని అనుమానం వ్యక్తం చేశారు. నిరసనగా పదవి వదులుకుంటున్నానని తెలిపారు. ఇటీవల ప్రభుత్వానికి అసహనం కూడా విపరీతంగా పెరిగిపోయిందని అభిప్రాయపడ్డారు. జాతీయత పేరుతో జమ్ము కశ్మీర్ పై ద్వేషం పెంచకున్నారని తెలిపారు. నిజమైన ప్రజాస్వామ్యం మనం కోరుకున్నట్లయితే దాడుల నుంచి ప్రజలను కాపాడాలని … అలాంటి వాతావరణాన్ని కల్పించాలని ఫజల్ కోరారు. ఫజల్ రాజకీయాల్లోకి వచ్చే అవకాశముందని తెలుస్తోంది. నేషనల్ కాన్ఫరెన్స్ లో చేరనున్నట్లు సమాచారం.

IAS Shah Faesal Resigns From Services To Protest Killings In Kashmir-IAS Officer National Conference Party Protest Kashmir