తన తండ్రి ఒక రిక్షా నడుపుకొనే వ్యక్తి.. అయిన కష్టపడి కలెక్టర్ అయ్యాడు..గోవింద్ జైస్వాల్ సక్సెస్ స్టోరీ...  

Ias Officer Govind Jaiswal, Son Of Rickshaw Puller-ias Officer Govind Jaiswal,son Of Rickshaw Puller,success Story,గోవింద్ జైస్వాల్,నారాయణ్ జైస్వాల్

తను ఒక దిగువ మధ్య తరగతి కుటుంబానికి చెందిన అబ్బాయి. తన చిన్న తనం లో తనతో పాటు చదువుకుంటున్న స్నేహితుల వాళ్ళయింటికి వెళ్ళినపుడు అతని స్నేహితుల తల్లిదండ్రులు ఆ అబ్బాయి పైన కోపం చూపించి మరొక్కసారి వారి కొడుకులతో కలిసి తిరగవద్దని హెచ్చరించారు. దానికి కారణం ఆ అబ్బాయి పేదవాడు కావడమే ..

తన తండ్రి ఒక రిక్షా నడుపుకొనే వ్యక్తి.. అయిన కష్టపడి కలెక్టర్ అయ్యాడు..గోవింద్ జైస్వాల్ సక్సెస్ స్టోరీ...-IAS Officer Govind Jaiswal, Son Of Rickshaw Puller

అప్పుడే అనుకున్నాడు తను పెద్దయ్యాక అందరి ముందు గౌరవంగా మంచి స్థాయి లో జీవించాలి అని . ఆ అబ్బాయే కష్టపడి ఇప్పుడు కలెక్టర్ అయ్యాడు. అతనే గోవింద్ జైస్వాల్ .

రిక్షా నడుపుకొనే వ్యక్తి కుమారుడు అన్న పేరు నుండి జిల్లా పాలనదికారి దాగా ఎదిగిన గోవింద్ కథ ఎందరికో ఆదర్శం.

గోవింద్ జైస్వాల్ తండ్రి నారాయణ్ జైస్వాల్ ఒక గవర్నమెంట్ రేషన్ షాప్ లో పని చేస్తుండేవాడు. అతని సంపాదన మొత్తం ఇంట్లో వారి గురించే ఖర్చు చేసేవాడు.కొన్నాళ్లకు ఆ రేషన్ షాప్ మూసివేయడం తో ఉద్యోగాన్ని కోల్పోయాడు నారాయణ్.

చేసేది ఏం లేక నారాయణ్ తన దగ్గర ఉన్న కొంత మొత్తం తో కొన్ని రిక్షాలు కొని వారిని కిరాయికి ఇచ్చేవాడు. అలాగే వాటిలో వచ్చిన లాభం తో కొంత భూమి ని కొనుగోలు చేసాడు. కొన్నాళ్లకు నారాయణ్ జైస్వాల్ భార్య అనారోగ్యం కారణంగా చనిపోవడం తో మళ్ళీ ఆర్థికంగా కిందకి దిగజరిపోయారు.

రిక్షాలను , దాచుకున్న భూమి ని అమ్మేసి గోవింద్ జైస్వాల్ అక్కలకు పెళ్లి చేసాడు నారాయణ్ . కొడుకుని చదివించాలని రిక్షా తొక్కడం మొదలు పెట్టాడు నారాయణ్ జైస్వాల్

గోవింద్ జైస్వాల్ తన తండ్రి తో కలిసి ఉండేవాడు. అతని పై చదువులు పూర్తి అయ్యాక గోవింద్ కలెక్టర్ చదువుతా అని తండ్రికి చెప్పాడు.

దానికి తండ్రి సంతోషించి అతను కొడుకు కోసం దాచిన 40000 రూపాయలను ఇచ్చి కోచింగ్ కి పంపించాడు. అలా కోచింగ్ కోసం ఢిల్లీ కి వెళ్లిన గోవింద్ జైస్వాల్ నెలవారీ ఖర్చుల కోసం అక్కడ చిన్న చిన్న పనులు చేసుకునేవాడు. అలా కష్టపడుతూ చదివి మొదటి సరిగా సివిల్స్ పరీక్ష లు రాసాడు. 2006 లో ఫలితాలు వెలువడిన తరువాత గోవింద్ జీవితం లో అది మరుపురాని రోజు గా మిగిలింది. అతనికి జాతీయ స్థాయి లో 48 వ ర్యాంక్ వచ్చింది. ప్రస్తుతం కలెక్టర్ గా బాద్యతలు నిర్వహిస్తున్న గోవింద జైస్వాల్ స్టోరీ ఎంతో మందికి ఆదర్శం.