ఈ ఐఏఎస్‌ అధికారి దేశంలోనే గొప్ప వ్యక్తి... పిల్లల పెళ్లి విషయంలో అందరికి ఆదర్శ  

Ias Officer Famous In India And Also Ideal For Making Son Marriage-ias Officer,ias Officer Basanth Kumar,viral In Social Media

ఈమద్య కాలంలో పెళ్లి చేయాలంటే మామూలు విషయం కాదు.ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అనే సామెత ఉంది.అప్పు చేసి పెళ్లిలు చేసే పరిస్థితి వస్తుంది.ఎంత పేద వారు అయినా కూడా పెళ్లి విషయంలో ఎక్కడ రాజీ పడకుండా ఖర్చు చేస్తున్నారు.పెట్టి పోతల విషయం పక్కన పెడితే పెళ్లి ఖర్చులు లక్షలు అవుతున్నాయి.ముఖ్యంగా ఫొటో, వీడియోగ్రాఫర్స్‌, మండపం మరియు బోజనాల ఖర్చులు అన్ని కూడా లక్షలు దాటుతున్నాయి.

Ias Officer Famous In India And Also Ideal For Making Son Marriage-ias Officer,ias Officer Basanth Kumar,viral In Social Media-IAS Officer Famous In India And Also Ideal For Making Son Marriage-Ias Ias Basanth Kumar Viral Social Media

మీడియంగా చేసినా కూడా కనీసం మూడు లక్షల నుండి పది లక్షల రూపాయలు అవుతున్నాయి.

Ias Officer Famous In India And Also Ideal For Making Son Marriage-ias Officer,ias Officer Basanth Kumar,viral In Social Media-IAS Officer Famous In India And Also Ideal For Making Son Marriage-Ias Ias Basanth Kumar Viral Social Media

ఇలాంటి సమయంలో ఒక ఐఏఎస్‌ అధికారి తన కూతురు పెళ్లిని గతంలో కేవలం 16,100 రూపాయలు ఖర్చు చేసి చేశాడు.ఇప్పుడు ఆయనే తన కొడుకు పెళ్లిని కూడా 18 వేల ఖర్చుతో చేస్తున్నాడు.ఆయన ఐఏఎస్‌ బసంత్‌ కుమార్‌.ఈయన ప్రస్తుతం విశాఖపట్నం మెట్రో ప్రాంతీయ అభివృద్ది మండలి కమీషనర్‌గా జాబ్‌ చేస్తున్నారు.

నిజాయితీ పరుడిగా పేరు దక్కించుకున్న బసంత్‌ కుమార్‌ తన కూతురు మరియు కొడుకు విషయంలో చాలా నిరాడంబరంగా వ్యవహరించారు.చిన్నప్పటి నుండి కూడా వారు ఒక మద్య తరగతి కుటుంబంకు చెందిన పిల్లల మాదిరిగానే పెంచారు.

పట్నాల బసంత్‌ కుమార్‌ తాజాగా తన కొడుకు పెళ్లికి ఏర్పాట్లు చేశారు.విశాఖపట్నంలోని దయాల్‌ నగర్‌లోని సత్సంగ్‌ ఆధ్వర్యంలో బసంత్‌ కుమార్‌ తనయుడి పెళ్లి జరుగబోతుంది.ఈనెల 8వ తారీకున అతి సాదా సీదాగా ఈ పెళ్లి జరుగబోతుంది.ఈ పెళ్లికి తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు మరియు పలు రాజకీయ నాయకులు కూడా హాజరు కాబోతున్నారు.

ఈ పెళ్లికి అమ్మాయి తరపు వారు 18 వేలు ఖర్చు చేస్తుండగా, బసంత్‌ కుమార్‌ ఫ్యామిలీ తరపున 18 వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు.మొత్తం కలిసి కేవలం 36 వేలు మాత్రమే ఖర్చు చేస్తున్నారు.

ఇంత తక్కువ పెళ్లి ఖర్చు అంటూ ప్రస్తుతం బసంత్‌ కుమార్‌ తనయుడి వివాహం గురించి సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతుంది.తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు పేద వారి పెళ్లి ఖర్చులకు అంటే లక్షలు లక్షలు ఇస్తున్నారు.అలాంటిది ఐఏఎస్‌ అధికారి కొడుకు పెళ్లి కేవలం 36 లక్షలతో జరగడం చర్చనీయాంశం అవుతోంది.పెళ్లి పేరుతో లక్షలు వృదా చేయకుండా ఇలా తక్కువ ఖర్చుతో పెళ్లి చేయడం మంచి పద్దతి అంటూ బసంత్‌ కుమార్‌ పై ప్రశంసలు కురుస్తున్నాయి.