ప్రధాని కార్యాలయానికి షిఫ్ట్ అయిన ఐఏఎస్ ఆమ్రపాలి... అరుదైన గౌరవం

చిన్న వయస్సులోనే సివిల్స్ సాదించి ఐఏఎస్ ఆఫీసర్ గా తెలంగాణలో వివిధ హోదాలలో పని చేసిన డేరింగ్ ఆఫీసర్ ఆమ్రపాలి.ఈమె తెలంగాణలో పని చేస్తున్న సమయంలో జాయింట్ కలెక్టర్ నుంచి కలెక్టర్ అయ్యేంత వరకు ప్రతి చోట తన మార్క్ ఉండేలా చూసుకుంది.

 Ias Officer Amrapali Kati Appointed As Deputy Secretary In Pmo, Visakhapatnam, I-TeluguStop.com

అందరికంటే ముందు ఉంటూ, ఏ విషయం మీద అయిన వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ అమలు చేసే సామర్ధ్యం ఉన్న ఆమ్రపాలి ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ని సైతం తన సామర్ధ్యంతో మెప్పించి ప్రశంసలు అందుకుంది.ఆమె కెరియర్ లో చాలా సమర్ధవంతమైన సేవలు అందిస్తున్న ఆమ్రపాలిని కేసీఆర్ ఏకంగా ఎన్నికల సంఘం అధికారినిగా కూడా నియమించారు.

ఇక ఆమె సేవలని గుర్తించి మోడీ నాయకత్వంలోనే కేంద్ర ప్రభుత్వం ఏకంగా ఆమెని కేంద్ర సర్వీసులకి తీసుకుంది.

ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో పనిచేస్తున్న ఈమెకి మరో అరుదైన గౌరవం దక్కింది.

ఆమె సేవలని గుర్తించిన ప్రభుత్వం తాజాగా ప్రధాని కార్యాలయంలో డిప్యూటీ సెక్రెటరీగా నియమించింది.ఈ పదవిలో ఆమె 2023, అక్టోబర్ వరకూ కొనసాగనున్నారు.అమ్రపాలితో పాటు డైరెక్టర్ గా రఘురాజ్ రాజేంద్రన్, అండర్ సెక్రటరీగా మంగేశ్ గిల్టియాల్ ను నియమిస్తూ, క్యాబినెట్ నియామకాల కమిటీ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.2010 ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కు చెందిన అమ్రపాలి గతంలో వికారాబాద్ సబ్ కలెక్టర్ గా, రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ గా, వరంగల్ కలెక్టర్ గా, రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిణిగా సేవలందించారు.ఇప్పుడు ఏకంగా ప్రధానమంత్రి కార్యాలయంలో డిప్యూటీ సెక్రెటరీ హోదాకి ఆమ్రపాలి వెళ్ళిపోయింది.ఈమె స్వస్థలం విశాఖపట్నం కావడం.ఇప్పుడు అక్కడ ఆమ్రపాలికి వచ్చిన గుర్తింపు నేపధ్యంలో ఆమె తల్లిదండ్రులకి అభినందనలు తెలుపుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube