పాకిస్థాన్ మన ఇండియా నుంచి ఏర్పడిన ఒక దేశం అనే విషయం తెలిసిందే.స్వతంత్ర దేశంగా ఉన్న పాక్‌లో చట్టాలు మనతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటాయి.
కానీ వ్యవస్థలు మాత్రం సేమ్ అని చెప్పచ్చు.ముఖ్యంగా ఇండియాలో ఐఏఎస్, ఐపీఎస్ వ్యవస్థ ఉన్నట్లే పాక్‌లో కూడా ఒక వ్యవస్థ ఉంది.
ఇండియాలో సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్‌లో పాస్ అయిన వారు ఐఏఎస్, ఐపీఎస్ పోస్టులకు సెలెక్ట్ అవుతారు.పాక్‌లో కూడా సేమ్ ఇలాంటి పరీక్షే నిర్వహించి అధికారులను సెలెక్ట్ చేస్తారు.
మన ఇండియాలో IAS అని పిలిస్తే పాక్‌లో మాత్రం PAS అని పిలుస్తారు.అంటే పాకిస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అని అర్థం.
పాక్‌లో నిర్వహించే పరీక్షను సెంట్రల్ సుపీరియర్ సర్వీసెస్ అని పిలుస్తారు.
మన ఇండియాలో ఐఏఎస్ పరీక్ష ఎంత టఫ్ గా ఉంటుందో ఇక్కడ కూడా సెంట్రల్ సుపీరియర్ సర్వీసెస్ అంతే టఫ్ గా ఉంటుంది.
పరీక్షలు క్లియర్ చేయడం, తర్వాత ఇంటర్వ్యూలకి హాజరు కావడం, ఆపై మెడికల్ టెస్ట్ పాస్ అయితేనే జాబ్స్ కన్ఫర్మ్ అవుతాయి.ఈ పరీక్షను ఇండియాలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేస్తుండగా.
పాక్‌లో ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తుంది.మొత్తంగా చూసుకుంటే మన ఇండియాలో ఎలా ఐఏఎస్‌లను సెలెక్ట్ చేసుకుంటారో ఇక్కడ కూడా అదే విధంగా సివిల్ సర్వీస్ అభ్యర్థులను సెలెక్ట్ చేసుకుంటారని చెప్పొచ్చు.

సివిల్ సర్వీస్ అధికారులు గ్రామాల నుంచి పట్టణాల వరకు అన్ని అభివృద్ధి కార్యక్రమాలలో కీలక పాత్ర పోషిస్తుంటారు.మీరు సమాజాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలంటే తెలివిగా ఉండాలి.అలాగే అప్పటికప్పుడు సమస్యలకు పరిష్కారం కనిపెట్టాలి.ఆ క్వాలిటీస్ ఉన్న వారిని మాత్రమే మన దేశమైనా, దాయాది దేశమైనా ఎంచుకుంటుంది.