పవన్ కళ్యాణ్ ని చేడమెడ తిట్టేసిన IAS అధికారులు

తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మొట్టమొదటిసారిగా ఉత్తర భారతీయ ఐఏఎస్ అధికారుల చేతిలో పెట్టిన సంగతి తెలిసిందే.ఈ విషయం మీద జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన స్పందనను ఇలా తెలియజేసారు.

 Ias Association Hits Pawan Kalyan Hard On Controversial Tweet-TeluguStop.com

“నేను ఉత్తర భారతీయ ఐఏఎస్ అధికారులు తిరుమలలో ఛార్జ్ తీసుకోవడాన్ని వ్యతిరేకించట్లేదు.కాని ఓ దక్షిణ భారతీయుడిని ఉత్తర భారతంలో ఉన్న పవిత్ర స్థలాలు అమరనాథ్, వారణాసి, మధుర లాంటి వాటికి అధికారిగా నియమిస్తారా ? వారు దక్షిణ భారతీయులని అనుమతించనప్పుడు, దక్షిణాది వారు ఎందుకు అనుమతించాలి? నాకు అర్థం కాని విషయం ఏమిటంటే ఇటు టిటిడి, అటు ముఖ్యమంత్రి (చంద్రబాబునాయుడు) ఈ నిర్ణయాన్ని ఎలా తీసుకున్నారు? వారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, మొత్తం దక్షిణాది ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది”.

ఈ స్టేట్మెంట్ దేశవ్యాప్తంగా పెద్ద దుమారమే రేపింది.ఈ మధ్యకాలంలో “నార్త్-సౌత్” విభేదాలపై పవన్ కళ్యాణ్ మాట్లాడటం ఇది మొదటిసారి కాదు.కాని ఈ స్టేట్మెంట్ రేపిన కలకలం అంతా ఇంతా కాదు.దాంతో ఐఏఎస్ అధికారుల సంఘం స్పందించాల్సి వచ్చింది.

“IAS అంటే Indian Administrative Service.మేము అన్ని రాష్ట్రాల్లో ఉత్తరం, దక్షిణం, పశ్చిమం,తూర్పు, ఉత్తర తూర్పు అనే తేడాలు లేకుండా పనిచేస్తాం.తిరుపతిని దక్షిణభారతీయ పవిత్ర స్థలంగా చెప్పడం కూడా తప్పు.ప్రజలందరికి భక్తీ ఉంటుంది.ఇలాంటి గోడలు కట్టొద్దు” అంటూ పవన్ కళ్యాణ్ కి తమ స్పందన గట్టిగా తెలిపింది ఐఏఎస్ అధికారుల సంఘం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube