నిందితుడి మాట ! జగన్ అలా అవ్వాలనే ఇలా చేశా !   Iam Trying Simpathi To Jagan Accused Srinivasarao Telling     2018-10-25   21:00:49  IST  Sai M

విశాఖ ఎయిర్ పోర్ట్ లో వైసీపీ అధినేత జగన్ పై దాడి చేసిన నిందితుడు శ్రీనివాసరావు పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. వైసీపీ అధ్యక్షుడు జగన్ ఈ సారైనా ఏపీ సీఎం కావాలన్న ఉద్దేశ్యంతోనే ఆయనపై సానుభూతి పెంచడానికి కత్తితో దాడి చేసినట్లు నిందితుడు శ్రీనివాసరావు పోలీసుల విచారణలో చెప్పినట్టు తెలుస్తోంది.

వైసీపీ అంటే తనతో సహా తమ కుటుంబం మొత్తానికి అభిమానమని శ్రీనివాసరావు చెప్పాడు. జగన్‌పై దాడి జరిగిన తరువాత ఎయిర్‌పోర్టులో శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని స్టేట్‌మెంట్‌ను వీడియో రికార్డ్‌ చేశారు. ఈ విచారణకు సంబంధించిన వీడియో టేపును విశాఖలో పోలీసులు విడుదల చేయనున్నారు.