అలా చేసిన వ్యక్తిని లాగి చెంపపై కొట్టా.. సోనియా అగర్వాల్ షాకింగ్ కామెంట్స్!

Iam Rough And Tough Type Says By Sonia Agarwal

భారతీయ సినీ నటీమణులలో ఒకరైన సోనియా అగర్వాల్ 7/జీ బృందావన కాలనీ సినిమా ద్వారా పాపులారిటీని పెంచుకున్నారు.ఆ సినిమా తర్వాత సోనియా అగర్వాల్ కొన్ని తెలుగు సినిమాలలో, కొన్ని తమిళ సినిమాలలో నటించారు.

 Iam Rough And Tough Type Says By Sonia Agarwal-TeluguStop.com

సోనియా అగర్వాల్ మాతృభాష పంజాబీ కాగా 2006 సంవత్సరం డిసెంబర్ నెలలో సోనియా అగర్వాల్ వివాహం జరిగింది.ప్రముఖ దర్శకుడు సెల్వ రాఘవన్ ను సోనియా అగర్వాల్ వివాహం చేసుకున్నారు.

స్కూల్ లో చదివే సమయంలోనే సోనియా అగర్వాల్ కు ఒక టీవీ సీరియల్ లో నటించే ఛాన్స్ అయితే వచ్చింది.తాజాగా సోనియా అగర్వాల్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.

 Iam Rough And Tough Type Says By Sonia Agarwal-అలా చేసిన వ్యక్తిని లాగి చెంపపై కొట్టా.. సోనియా అగర్వాల్ షాకింగ్ కామెంట్స్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

చిన్నతనం నుంచి తనకు మ్యూజిక్ అంటే ఎంతో ఇష్టమని సొంతంగా పాట పాడాలనే కోరిక ఉండేదని ఆమె వెల్లడించారు.తన సోదరుడు మ్యూజిక్ డైరెక్టర్ కావడంతో సింగర్ గా పాట పాడి నటించాలనే కోరిక తనకు ఉండేదని సోనియా అగర్వాల్ చెప్పుకొచ్చారు.

త్వరలో సోనియా అగర్వాల్ నటించిన గ్రాండ్ మా సినిమా రిలీజ్ కానుంది.

Telugu Chance, Grand Maa, Mis Behavior, Rough Tough, Sonia Agarwal, Soniaagarwal, Sonia Aggarwa, Tollywood-Movie

గ్రాండ్ మా సినిమాలో తాను టీచర్ రోల్ లో నటించానని సాధారణంగా అనేక సినిమాలలో తన పాత్రలు అమాయకురాలిగా ఉన్నా రియల్ లైఫ్ లో మాత్రం తను రఫ్ అండ్ టఫ్ టైప్ అని సోనియా అగర్వాల్ అన్నారు.స్కూల్ డేస్ లో ఒక అబ్బాయి తనను హేళన చేశాడని ఆ అబ్బాయిని తాను లాగి చెంపపై కొట్టానని సోనియా అగర్వాల్ చెప్పుకొచ్చారు.

తన మాతృభాష పంజాబీ అయినా దక్షిణాది భాషల్లో ఏకంగా 40కు పైగా సినిమాలలో నటించానని సోనియా అగర్వాల్ తెలిపారు.

తనకు ఒక తమ్ముడు మాత్రమే ఉన్నాడని భవిష్యత్తులో ఛాన్స్ వస్తే గాయనిగా ఖచ్చితంగా నటిస్తానని సోనియా అగర్వాల్ కామెంట్లు చేశారు.

#Grand Maa #Sonia Aggarwa #Chance #SoniaAgarwal #Tough

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube