జాన్వీ కపూర్ సినిమాపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అభ్యంతరం

ఇండియన్ ఫస్ట్ విమెన్ ఎయిర్ ఫైటర్ గుంజన్ సక్సేనా జీవిత కథతో జాన్వీ కపూర్ టైటిల్ రోల్ లో నటించిన సినిమా గుంజన్ సంక్సేనా ది కార్గిల్ గర్ల్ సినిమా తాజాగా నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయ్యింది.ఇక ఈ సినిమాకి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది.

 Iaf Objects To Some Scenes In Gunjan Saxena, Bollywood, Jhanvi Kapoor, Karan Joh-TeluguStop.com

జాన్వీ కపూర్ నటనకి కూడా మంచి మార్కులు పడ్డాయి.రెండో సినిమానే బయోపిక్ కథలో నటించి జాన్వీ కపూర్ నటిగా తనని తాను మరోసారి ప్రూవ్ చేసుకుందని విమర్శకుల ప్రశంసలు లభిస్తున్నాయి.

ఇలాంటి వేళ ఈ సినిమాపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అభ్యంతరం తెలిపింది.సినిమాలో కొన్ని అభ్యంతరక సన్నివేశాలు ఉన్నట్లు సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్‌కు లేఖ రాసింది.

ఎయిర్ ఫోర్స్ మీద నెగిటివ్ అభిప్రాయాన్ని కలిగించేలా ఉందని అభిప్రాయపడింది.అలాగే లేఖను నెట్ ఫ్లిక్స్, ధర్మ ప్రొడక్షన్ హౌస్‌కు కూడా పంపింది.

కొద్ది రోజుల క్రితం కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ కీలకమైన ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. రక్షణ వ్యవస్థ మీద సినిమాలు తీసేటపుడు ఎలాంటి అభ్యంతరక సన్నివేశాలు, రక్షణ శాఖని కించపరిచే విధంగా ఉండకూడదని, అలా ఉంటే సినిమా రిలీజ్ ని ఆపేసే అధికారం ఉందని తెలిపింది.

ఈ నేపధ్యంలో గుంజన్ సక్సేనా సినిమాపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అభ్యంతరాలు వ్యక్తం చేసింది.ఈ సినిమా తీస్తున్నప్పుడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గౌరవ మర్యాదలు పెంచేలా తీస్తామని, అలాగే భవిష్యత్ తరాలకు ఆదర్శవంతంగా ఉండేలా తీస్తామని చెప్పారని, కానీ, ఇటీవల విడుదలైన సినిమా ట్రైలర్ చూస్తుంటే అందులో కొన్ని సన్నివేశాలు, సంభాషణలు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ తమ దృష్టికి వచ్చిందని, తాము పరిశీలించగా అలాగే తోచిందంటూ ఆ లేఖలో ఐఏఎఫ్ పేర్కొంది.

గుంజన్ సక్సేనా క్యారెక్టర్‌కి భారీ హైప్ తీసుకురావడం కోసం ధర్మ ప్రొడక్షన్స్ సంస్థ ఐఏఎఫ్‌ మీద నెగిటివ్ ప్రభావం వచ్చేలా తీసిందని అభ్యంతరం తెలిపింది.సినిమాలు అభ్యంతరకంగా ఉన్న సన్నివేశాలు తక్షణం తొలగించాలని సూచించింది.

ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ కాగా దీనిపై నిర్మాత కరణ్ జోహార్, నెట్ ఫ్లిక్స్ సంస్థలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయి అనేది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube