ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ మెరుపు దాడికి అయిన ఖర్చు ఎంతో తెలుసా.. ఇది మన సత్తా, ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయం

పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ పాకిస్తాన్‌లో ఉగ్ర మూకల్ని చావు దెబ్బ తీసింది.మరోసారి ఇండియా వైపు చూసేందుకు సైతం ఉగ్రవాదులు భయపడేలా ఈ దాడి జరిగింది.

 Iaf Airstrike Bombs Worth-TeluguStop.com

దాదాపు 350 నుండి 400 మంది ఉగ్రవాదులు మృతి చెందినట్లుగా అంచనా వేస్తేన్నారు.ఉగ్రవాద సంస్థలకు చెందిన ప్రధాన వ్యక్తులు ఈ దాడిలో మృతి చెందినట్లుగా తెలుస్తోంది.

ఈ సర్జికల్‌ స్ట్రైక్‌కు సంబంధించి గత వారం రోజులుగా ప్రణాళికలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఈ ఎయిర్‌ సర్జికల్‌ స్ట్రైక్‌ కోసం ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌కు ఇండియన్‌ ప్రభుత్వం దాదాపుగా 6300 కోట్లను కేటాయించడం జరిగింది.

అయితే ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌లో ఉన్న అత్యున్నత శిక్షణ పొందిన వారు మరియు అత్యంత శక్తివంతమైన మిరేజ్‌ 2000 యుద్ద విమానాలు ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌లో ఉన్న కారణంగా ఈ ఆపరేషన్‌కు కేవలం 3700 కోట్లు మాత్రమే అయినట్లుగా నిపుణులు చెబుతున్నారు.కేంద్ర ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్‌ కంటే తక్కువ మొత్తానికే ఎయిర్‌ ఫోర్స్‌ ఈ ఆపరేషన్‌ పూర్తి చేయడం పట్ల జాతి మొత్తం గర్విస్తోంది.

ఉగ్ర స్థావరాలను ఛేదించేందుకు ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ వారు వేసిన బాంబుల ఖరీదు 1.7 కోట్లు కాగా, ఇక ఉగ్ర దాడిలో పాల్గొన్న యుద్ద విమానాల విలువ 2568 కోట్లుగా తెలుస్తోంది.మొత్తానికి ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ అతి తక్కువ సమయంలోనే, అతి తక్కువ ఖర్చుతో పాకిస్తాన్‌ ప్రేరేపిత ఉగ్రవాదుల గుండెల్లో గుబులు పుట్టించింది.మరో వైపు పాకిస్తాన్‌ ఎదురు దాడికి దిగితే తిప్పి కొట్టేందుకు ఇండియన్‌ ఆర్మీ మరియు ఎయిర్‌ ఫోర్స్‌ సిద్దంగా ఉంది.

ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ను పాకిస్తాన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ఎదుర్కోవడం సాధ్యం అయ్యే పని కాదు.మన వద్ద ఉన్న అత్యాధునిక యుద్ద విమానాలు మరియు బాంబులు పాకిస్తాన్‌ కు ఒణుకు పుట్టిస్తున్నాయి.

అందుకే ఇండియా మీదకు పాకిస్తాన్‌ యుద్దంకు దిగే ఛాన్స్‌ ఉండదని నిపుణులు చెబుతున్నారు.

ఈ ఎయిర్‌ సర్జికల్‌ స్ట్రైక్స్‌ ఇండియన్‌ ఆర్మీ మరియు ఎయిర్‌ ఫోర్స్‌ సత్తా ప్రపంచానికి చాటి చెప్పింది.ఈ దాడితో ప్రతి భారతీయుడు కూడా గర్వించాలి.పాకిస్తాన్‌కు గట్టి బుద్ది చెప్పినందుకు జై జవాన్‌.

జయహో భారత్‌.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube