నేను ఇంకా హీరోయిన్ గానే చేస్తా అంటున్న ఆ నటి

7/జి బృందావన్ కాలనీ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన నటి సోనియా అగర్వాల్. మొదటి సినిమాతోనే నటిగా మంచి మార్కులు వేసుకున్న ఈ అమ్మడుకి తరువాత ఏ సినిమా కూడా ఆశించిన స్థాయిలో గుర్తింపు తీసుకురాలేదు.

 I Wont Accept Mother Characters Says Sonia Agarwal, Tollywood, Kollywood, South Cinema, Star Heroines, Nayanatara, Trisha-TeluguStop.com

తరువాత కొన్ని సినిమాలలో హీరోయిన్ గా చేసింది.సక్సెస్ లు పెద్దగా లేకపోవడంతో దర్శకుడు సెల్వ రాఘవన్ ని పెళ్లి చేసుకొని సెటిల్ అయిపొయింది.

తరువాత ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకుంది.ఆ తరువాత మరల సినిమాలలోకి రీ ఎంట్రీ ఇచ్చిన కూడా హీరోయిన్ పాత్రలు మాత్రం ఈ భామకి రావడం లేదు.

 I Wont Accept Mother Characters Says Sonia Agarwal, Tollywood, Kollywood, South Cinema, Star Heroines, Nayanatara, Trisha-నేను ఇంకా హీరోయిన్ గానే చేస్తా అంటున్న ఆ నటి-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఏదో అలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నెట్టుకొస్తోంది.అయితే ఈ మధ్య సోనియా అగర్వాల్ ని ఏకంగా హీరో, హీరోయిన్స్ తల్లి పాత్రల కోసం ఎక్కువగా దర్శక నిర్మాతలు సంప్రదిస్తున్నారు.

చిన్న వయస్సులోనే తనకి తల్లిపాత్రలు ఆఫర్ చేయడంపై సోనియా అగర్వాల్ కాస్తా అసహనం వ్యక్తం చేసింది.పలు సినిమాల్లో నటించి, మెప్పించిన హీరోయిన్ సోనియా అగర్వాల్ తాజాగా ఒక విషయం పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.

తనను అమ్మ పాత్రల్లో నటించమని దర్శకనిర్మాతలు అడుగుతుండటం ఆశ్చర్యంగా ఉందని చెప్పింది.

తాను, నయనతార, త్రిష ముగ్గురం ఒకేసారి సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించామని, కానీ తనను మాత్రమే అమ్మ పాత్రలు చేయమని అడుగుతున్నారని, వాళ్లను ఎందుకు అడగడం లేదని ప్రశ్నించింది.

తాను ఇప్పటికీ ఎంతో ఫిట్ గా ఉన్నానని, హీరోయిన్ పాత్రలు చేసేంత గ్లామర్ తనలో ఉందని చెప్పింది.రాధిక, ఖుష్బూల మాదిరి వయసు పెరిగిన తర్వాత అమ్మ పాత్రల్లో నటిస్తానని తెలిపింది.

ఇప్పట్లో తాను అమ్మ పాత్రల్లో నటించబోనని చెప్పింది.అయితే త్రిష, నయనతార అంటే స్టార్ హీరోయిన్స్ గా వరుస విజయాలతో ఆ రేంజ్ ని అందుకున్నారు.

అందుకే ఇప్పటికే వారికి హీరోయిన్ పాత్రలే వస్తున్నాయి.అయితే సోనియా అగర్వాల్ మాత్రం ఓ విధంగా ఫేడ్ అవుట్ హీరోయిన్.

మరి ఈ హీరోయిన్ త్రిష, నయనతార తరహాలో తనకి కూడా మెయిన్ హీరోయిన్ పాత్రలే కావాలని అసాగడం కాస్తా అతిగానే అనిపిస్తుందని ఇండస్ట్రీలో మాట్లాడుకుంటున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube