పిల్లల చదువు ఖర్చులు నేను పెట్టుకుంటా.. మిగితా ఖర్చులన్నీ మా ఆయనే చూసుకోవాలి: అక్షయ్ కుమార్ భార్య

ప్రస్తుత కాలంలో ఎంతో మంది స్టార్ సెలబ్రిటీలు ఒకవైపు సినిమాలలో కొనసాగుతూనే మరొకవైపు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ప్రేక్షకులకు మరింత దగ్గర అవుతున్నారు.ఈ క్రమంలోనే తమ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూల ద్వారా పలువురు సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తూ వారి గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను అభిమానులకు తెలియజేస్తున్నారు.

 I Will Take Care Of Children And He Will Take Care Of All Other Expenses Say Aks-TeluguStop.com

ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీలు యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులకు మరింత దగ్గరయ్యారు.ఈ క్రమంలోనే బాలీవుడ్ బ్యూటీ కాజోల్  ‘ట్వీక్’ ఇండియా యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే కాజోల్ తన  ‘ట్వీక్’ ఇండియా యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ కోసం బాలీవుడ్ నటి, రచయిత్రి, ప్రముఖ హీరో అక్షయ్ కుమార్ సతీమణి ట్వింకిల్ ఖన్నాను ఇంటర్వ్యూ చేసింది.ఈ క్రమంలోనే వీరిద్దరూ ఎన్నో విషయాల గురించి ముచ్చటించారు.

ఈ సందర్భంగా ట్వింకిల్ ఖన్నా మాట్లాడుతూ కాజోల్, తన భర్త అజయ్ దేవగన్ ఎన్నో సినిమాలలో నటించి భారీ మొత్తంలో సంపాదించి ఉంటారు ఈ క్రమంలోనే తను వారి ఆర్థిక పరిస్థితులను ఏ విధంగా చక్కబెట్టుకుంటున్నారు అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసింది.

Telugu Ajay Devgan, Akshay Kumar, Bollywood, Expenses, Childrens, Kajol, Tweek I

ఈ విషయం గురించి ట్వింకిల్ ఖన్నా కాజోల్ ను ప్రశ్నిస్తూ.నీవు ఎక్కువ కాలం సినిమాలలో నటించావు కనుక నీవు ఎంతోకొంత సంపాదించి ఉంటావు.మీరు మీ ఇంటి ఖర్చులను విభజించుకుంటారా? లేక ఎవరు ఎక్కువ ఖర్చులు పెట్టుకుంటారు అంటూ ప్రశ్నించారు.ఈ సందర్భంగా ట్వింకిల్ ఖన్నా మాట్లాడుతూ ఉదాహరణకు మా ఇంట్లో నా పిల్లల చదువులకు సంబంధించిన ఖర్చులన్నింటిని నేనే చూసుకుంటాను మిగితా ఖర్చులన్నీ నా భర్త అక్షయ్ కుమార్ చూసుకుంటారు.

Telugu Ajay Devgan, Akshay Kumar, Bollywood, Expenses, Childrens, Kajol, Tweek I

కేవలం పిల్లల చదువులు మాత్రమే తానేందుకు చూసుకుంటాను అనే విషయానికి వస్తే భవిష్యత్తులో మిమ్మల్ని చదివించింది నేనే అని చెప్పుకోవడానికి అంటూ ఈమె సరదాగా సమాధానం చెప్పారు.మరి మీరు ఎలా ఎలా ఖర్చు చేస్తారు అంటూ ట్వింకిల్ ఖన్నా కాజోల్ ను ప్రశ్నించింది.ఈ సందర్భంగా ఆమె సమాధానం చెబుతూ ఇలాంటి విషయాలలో మేము ఎంతో క్లియర్ గా ఉన్నాము.

అజయ్ కు సంబంధించినది ఏదైనా నాదే.నాకు సంబంధించినది ఏదైనా తనదే అఫ్‌కోర్స్ పిల్లలు మాత్రం నావాళ్లే.

నిజాయితీగా చెప్పాలంటే ఇది సౌలభ్యాన్ని బట్టి ఉంటుందనుకుంటాను అంటూ ట్వింకిల్ ఖన్నా ప్రశ్నకు కాజోల్ అద్భుతమైన సమాధానం చెప్పింది.

Telugu Ajay Devgan, Akshay Kumar, Bollywood, Expenses, Childrens, Kajol, Tweek I

ఇక కాజోల్ అజయ్ దేవగన్ 1999లో వివాహం చేసుకున్నారు.వీరికి కూతురు నైసా, కొడుకు యోగ్ ఉన్నారు.అలాగే అక్షయ్ కుమార్ ట్వింకిల్ ఖన్నా 2001 లో వివాహం చేసుకున్నారు.

వీరికి కొడుకు ఆరవ్‌, కూతురు నితార ఉన్నారు.అయితే ఈమె కొంతకాలం పాటు ఇండస్ట్రీలో నటించినప్పటికీ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటుంది.

అయితే చిన్నప్పటి నుంచి తన తల్లి తనకు కష్టపడి పనిచేసే తత్వం నేర్పించిందని ఇప్పటికీ తాను అదే ఆచరిస్తున్నానని ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ట్వింకిల్ ఖన్నా వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube