ఆ పద్దెనిమిది వందలమందిని నేను చదివిస్తా.. పునీత్ సేవలను కొనసాగిస్తా: విశాల్

కన్నడ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా మంచి ప్రేక్షకాదరణ పొందిన పునీత్ రాజ్ కుమార్ ఆకస్మిక మరణం యావత్ చిత్రపరిశ్రమను తీవ్ర దుఃఖసాగరంలోకి నెట్టేసింది.ఆయన శుక్రవారం మధ్యాహ్నం గుండెపోటుతో మరణించడంతో అభిమానులు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.

 I Will Support That Eighteen Hundred Students It Will Be Continue The Services-v-TeluguStop.com

కేవలం నటుడిగా మాత్రమే కాకుండా పునీత్ ఎన్నో విద్యాలయాలను, అనాధ శరణాలయాలను, వృద్ధాశ్రమాల నడుపుతూ ఎంత గొప్ప మనసు చాటుకున్నారు.వీటితో పాటు ఏకంగా 1800 మంది పిల్లల చదువు వారి బాగోగుల బాధ్యతలను కూడా పునీత్ తీసుకున్నారు.

ఇదిలా ఉండగా పునీత్ మరణం తలచుకొని ఎంతోమంది సినీ ప్రముఖులు అభిమానులు ఆయన మృతికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ కన్నీటి పర్యంతమయ్యారు.ఇక పునీత్ మరణం గురించి హీరో విశాల్ స్పందిస్తూ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా విశాల్ మాట్లాడుతూ తనకు పునీత్ మంచి మిత్రుడని ఆయన మరణం ఊహించలేదని ఇప్పటికీ ఆ విషయం నుంచి తేరుకోలేకపోతున్నట్లు విశాల్ తెలిపారు.ఈ క్రమంలోనే విశాల్ మాట్లాడుతూ తన మిత్రుడు 1800 మంది పిల్లల బాధ్యతలు తీసుకుని వారి చదువులు వారి బాగోగులను చూసుకుంటున్నారు.

అతని మరణానంతరం తన మిత్రుడుగా ఆ 1,800 మంది పిల్లల బాధ్యతలను తాను తీసుకుంటున్నట్లు విశాల్ వెల్లడించారు.

Telugu Eighteen, Puneeth, Vishal-Movie

విశాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్నటువంటి ఎనిమి చిత్రం నవంబర్ 4వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలను నిర్వహించారు.ఈ వేడుకలో భాగంగా విశాల్ మాట్లాడుతూ మరొకసారి పునీత్ రాజ్ కుమార్ ను గుర్తు చేసుకొని ఆయన బాధ్యతలను విశాల్ తీసుకుంటున్నట్లు ఈ సందర్భంగా ప్రకటించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube