టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.ఈయన నటన గురించి అందరికీ తెలిసిందే.
ఇక ప్రభాస్ వ్యక్తిత్వం గురించి ఆయనతో నటించిన నటులు చాలా సార్లు తెలిపారు.ఈయనకు టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఎంతోమంది అభిమానులు ఉన్నారు.
ఇక ఎంతో మంది హీరోయిన్స్ లకు కూడా ప్రభాస్ అంటే ఎంతో పిచ్చి అనే చెప్పాలి.ఇదిలా ఉంటే తాజాగా ఓ నటి ప్రభాస్ ను పెళ్లి చేసుకుంటా అంటూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది.
ఇంతకీ ఆమె ఎవరో కాదు.
బాలీవుడ్ నటి కృతిసనన్.
మహేష్ బాబు నటించిన వన్ నేనొక్కడినే సినిమాతో తొలిసారిగా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది.ఇక ఈ సినిమా తనకు అంత సక్సెస్ ను ఇవ్వలేకపోయింది.
ఆ తర్వాత పలు సినిమాలలో నటించిన కూడా అంత గుర్తింపు తెచ్చుకోలేక పోవడంతో బాలీవుడ్ లోనే సెటిల్ అయ్యింది ఈ బ్యూటీ.ఇక ప్రస్తుతం మళ్ళీ పాన్ ఇండియా మూవీ తో టాలీవుడ్ కు రీ ఎంట్రీ ఇచ్చింది.

ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ఆది పురుష్.ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నాడు.ఇందులో కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తుంది.ఇక ప్రభాస్ రాముడి పాత్రలో, కృతి సనన్ సీత పాత్రలో నటిస్తుంది.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ బిజీలో ఉంది.ఇదిలా ఉంటే తాజాగా కృతి సనన్ ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నగా కొన్ని విషయాలు పంచుకుంది.
అందులో ప్రభాస్ గురించి కొన్ని విషయాలు మాట్లాడుతూ.ఒక వేళ పెళ్లి చేసుకునే అవకాశం వస్తే మాత్రం ప్రభాస్ ను పెళ్లి చేసుకుంటాను అని సంచలన వ్యాఖ్యలు చేసింది కృతిసనన్.