నన్ను అడిగితే తప్ప నేను చెప్పను.. నేను చాలా ప్రైవేట్ పర్సన్ అంటూ రాశి ఖన్నా పోస్ట్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ముద్దుగుమ్మ రాశి ఖన్నా గురించి తెలుగు ప్రేక్షకులందరికీ తెలిసిందే.తన నటనతో తనకంటూ సొంత గుర్తింపు సంపాదించుకుంది.

తెలుగులో కొన్ని సినిమాలలో నటించి మంచి సక్సెస్ లను అందుకుంది.అంతే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్ లో కూడా నటించి అక్కడ కూడా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.

ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ సినిమాతో సినీ ఇండస్ట్రీకి తొలిసారిగా ఎంట్రీ ఇచ్చింది.ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీకి ఊహలు గుసగుసలాడే సినిమాతో దగ్గరైంది.

ఇక జోరు, జిల్, బెంగాల్ టైగర్, హైపర్, తొలిప్రేమ, ప్రతి రోజు పండగే వంటి పలు సినిమాలలో నటించగా తన పాత్రలకు మంచి పేరు సంపాదించుకోగా సినిమా పరంగా కొంత వరకు సక్సెస్ అందుకుంది.మరి కొన్ని సినిమాలలో ప్లాప్ లు ఎదుర్కొంది.

Advertisement

కెరీర్ మొదట్లో బొద్దుగా కనిపించిన రాశి ఖన్నా ఇప్పుడు పూర్తి గ్లామర్ ను పరిచయం చేసింది.తెగ వర్క్ అవుట్ లు చేస్తూ మంచి ఫిజిక్ ను సంపాదించుకుంది.

అతి తక్కువ సమయంలో సన్నబడి తనలోని అందాలను బయట పెట్టింది.నిజానికి అవకాశాల కోసం రాశి ఖన్నా ఇలా తయారయిందని చెప్పవచ్చు.

ఇక సోషల్ మీడియాలో తన హాట్ ఫోటోలతో తెగ రచ్చ చేస్తుంది.అయినా కూడా ఈ ముద్దుగుమ్మ అంతగా అవకాశాలు అందుకోలేకపోతుంది.సినిమాలకు దూరంగా ఉన్న కూడా సోషల్ మీడియా ద్వారా మాత్రం తన అభిమానులతో టచ్ లో ఉంటుంది.

ఇక ఈ ముద్దుగుమ్మ బాగా అందాలను ఆరబోసిన కుర్రాళ్ల మతి పోగొడుతుంది.నిత్యం తన ఇన్ స్టా గ్రామ్ లో ఏదో ఒక పోస్టుతో బాగా హల్ చల్ చేస్తుంది.

మోక్షజ్ఞ ఫస్ట్ సినిమా పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన బాలకృష్ణ.. ఏంటో తెలుసా?
మొదటి సినిమాతోనే రికార్డ్ లు బ్రేక్ చేయాలని చూస్తున్న స్టార్ హీరో కొడుకు..?

తాను ఖాళీ సమయంలో సరదాగా తిరిగిన ట్రిప్స్ ఫోటోలను కూడా బాగా షేర్ చేసుకుంటుంది.అప్పుడప్పుడు తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు కూడా పెడుతూ ఉంటుంది.ఇక తాజాగా తన ఇన్ స్టా గ్రామ్ లో ఓ పోస్ట్ షేర్ చేసుకుంది.

Advertisement

అందులో నన్ను అడిగితే తప్ప నేను చెప్పను నేను చాలా ప్రైవేట్ పర్సన్ అంటూ తెలిపింది.అంటే తను తన వ్యక్తిగత విషయంలో ఎవరికి నేరుగా చెప్పనని అడిగితేనే మాత్రం చెబుతాను అని అన్నది.ఇక ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్ గా మారగా ఇంతకీ రాశి ఖన్నా ఇలా పెట్టడానికి కారణం ఏంటి అని ప్రశ్నలు వేస్తున్నారు.

మరి కొంతమంది తన వ్యక్తిగత విషయంలో ఎవరో తలదూర్చుకున్నారేమో అని కామెంట్లు పెడుతున్నారు.

కానీ రాశి ఖన్నా ఆ పోస్ట్ పెట్టడానికి వెనుక ఏదో కారణం ఉందని అర్థమవుతుంది.ఇక ఈ ముద్దుగుమ్మ సినిమాల విషయానికి వస్తే బాలీవుడ్ లో మాత్రం తెగ అవకాశాలు అందుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.కానీ టాలీవుడ్ కు మాత్రం దూరంగానే ఉందని అర్థమవుతుంది.

తాజా వార్తలు