స్పాట్ లో ఊస్టింగ్..మొదటి రోజే బిడెన్ స్ట్రాంగ్ వార్నింగ్..!!

అమెరికా అధ్యక్షుడుగా జో బిడెన్ ప్రమాణ స్వీకారం చేసిన విషయం విధితమే.మాజీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రముఖులు, అతిరధ మహారధులు అందరి సమక్షంలో బిడెన్ అనే నేను అంటూ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసేశారు.

 America President Joe Biden Warning To Staff, Staff To Berespectful, Virtual Tea-TeluguStop.com

కమలా హారీస్ ప్రమాణ స్వీకారం చేసిన తరువాత బిడెన్ ప్రమాణ స్వీకారం జరిగింది.ఈ క్రమంలోనే అమెరికా ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన బిడెన్ అందరిని తన ప్రసంగంతో ఆకట్టుకున్నారు.

అమెరికాను అగ్ర రాజ్య హోదాలో ఉంచడానికి తాను ఎప్పుడు కృషి చేస్తూనే ఉంటానని, నా ముందు ఉన్న సవాళ్లు ఎదుర్కోవడానికి మీ అందరి సహకారం కావాలని కోరారు.ఇదిలాఉంటే

బిడెన్ ప్రమాణ స్వీకారం తరువాత తాను ఏర్పాటు చేసుకున్న టీమ్ వర్చువల్ ప్రమాణ స్వీకారాన్ని బిడెన్ వీక్షించారు.

అనంతరం అందరిని ఉద్దేశించి మాట్లాడిన బిడెన్ అధ్యక్షుడి హోదాలో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.మీరు నాతో కలిసి పనిచేయడానికి సిద్దపడ్డారు అందుకు ఎంతో సంతోషంగా ఉంది.అయితే మనతో పాటు పనిచేసే సహా ఉద్యోగులను గౌరవించడం ఎంతో ముఖ్యం.వారిని ఇబ్బందులు పెట్టినా, అవమానించినా, గౌరవం ఇవ్వకపోయినా నేను సహించనని తేల్చి చెప్పేశారు.

ఒక వేళ నా దృష్టికి ఎలాంటి సంఘటనలు వచ్చినా స్పాట్ లో విధుల నుంచీ తొలగిస్తానని హెచ్చరించారు.

Telugu Americajoe, Joe Biden, Kamala Harris, Netizens, Virtual-Telugu NRI

విజయం అందరం కలిస్తేనే సాధించగలం, ఆ విషయాన్ని ప్రతీ ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలని సూచించారు.నేను జోక్ చేయడం లేదు, మీరు విన్నది కూడా నిజమే మిమ్మల్ని తొలగించడానికి సెకను కూడా ఆలోచన చేయను, కారణాలు చెప్పే అవకాశాలు కూడా మీకు ఇవ్వను ఈ విషయాలు గుర్తు పెట్టుకోండి అంటూ మొదటి రోజే అందరికి షాక్ ఇచ్చారు.బిడెన్ చేసిన ఈ వ్యాఖ్యలతో వైట్ హౌస్ సిబ్బంది, టీమ్ సంతోషం వ్యక్తం చేశారు.

ఇక నెటిజన్లు మాత్రం బిడెన్ తీరుపై ప్రశంసలు కురిపిస్తున్నారు.ట్రంప్ కు ఎదురు చెప్పినా, ట్రంప్ తీసుకునే నిర్ణయాలు తప్పని చెప్పినా వారిని ఘోరంగా అవమానిస్తూ ట్విట్టర్ లో ట్వీట్ చేస్తూ మరీ ఉద్యోగం నుంచీ తొలగించే కానీ ట్రంప్ కు బిడెన్ కు చాలా తేడా ఉందని కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube