చాలా గర్వంగా ఉంది.. ఎంజాయ్ చెయ్యంటూ సూర్యకు విషెస్ తెలిపిన కమల్?

సినిమా ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డు వేడుకలో పాల్గొనడం ఎంతో అదృష్టంగా భావిస్తారు.అయితే ఇలా ఆస్కార్ అవార్డు వేడుకలో భాగంగా పలు చిత్ర పరిశ్రమల నుంచి కొందరు సెలబ్రెటీలకు ఆహ్వానం అందుతుంది.

 I Was Very Proud Kamal Wished To Hero Surya Details, Kamal Hassan, Hero Surya, Kollywood, Wishes, Film Industry, Surya Oscar Awards Event, Vikram Movie, Surya Rolex Role, Kamal Hasan Surya, Kamal Wishes Surya-TeluguStop.com

ఈ క్రమంలోనే తమిళ చిత్ర పరిశ్రమ నుంచి ఆస్కార్ అవార్డు వేడుకలకు పాల్గొనే అవకాశాన్ని అందుకున్న మొట్టమొదటి తమిళ హీరోగా సూర్య అరుదైన గౌరవాన్ని అందుకున్నారు.ఈ క్రమంలోనే ఈ విషయాన్ని వెల్లడించడంతో పెద్ద ఎత్తున సూర్య అభిమానులతో పాటు పలు వరు సెలబ్రిటీలు సూర్యకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఈ క్రమంలోనే యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ ఈ విషయంపై స్పందిస్తూ… నా బ్రదర్ సూర్యకు ఈ విధమైనటువంటి పిలుపు వచ్చినందుకు చాలా గర్వంగా ఉంది.సూర్య జస్ట్ ఆ మూమెంట్స్ ను ప్రౌడ్ గా ఎంజాయ్ చెయ్ అంటూ కమల్ హాసన్ సూర్యకు ట్వీట్ చేశారు.

 I Was Very Proud Kamal Wished To Hero Surya Details, Kamal Hassan, Hero Surya, Kollywood, Wishes, Film Industry, Surya Oscar Awards Event, Vikram Movie, Surya Rolex Role, Kamal Hasan Surya, Kamal Wishes Surya-చాలా గర్వంగా ఉంది.. ఎంజాయ్ చెయ్యంటూ సూర్యకు విషెస్ తెలిపిన కమల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రస్తుతం కమల్ హాసన్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇకపోతే తాజాగా కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమాలో సూర్య రోలెక్స్ పాత్రలో ఎంతో అద్భుతంగా నటించారు.

ఈ విధంగా విక్రమ్ సినిమా విజయంలో సూర్య పాత్ర కూడా కీలకంగా ఉండటంతో కమల్ హాసన్ సూర్య మధ్య ఎంతో మంచి అనుబంధం ఏర్పడింది.ఇక ఈ సినిమాలో ఎలాంటి రెమ్యూనరేషన్ లేకుండా నటించినందుకుగాను కమల్ హాసన్ సూర్యకు ఖరీదైన రోలెక్స్ వాచ్ కానుకగా ఇచ్చారు.ఇకపోతే సూర్య నటించబోయే టైటిల్ సినిమా సీక్వెల్ చిత్రంలో కూడా కమల్ హాసన్ అతిథి పాత్రలో సందడి చేయనున్నట్లు వెల్లడించారు.ఇలా వీరిద్దరి మధ్య ఎంతో మంచి అనుబంధం ఏర్పడటంతో కమల్ హాసన్ సూర్యకు వచ్చిన ఈ అరుదైన ఆహ్వానంపై స్పందించి ట్వీట్ చేయడం ప్రస్తుతం వైరల్ అవుతుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube