ఆడపిల్ల పుట్టిందని నన్ను విసిరేశారు.. కార్తీకదీపం మోనిత నిజజీవితంలో కన్నీళ్ల కథ?

I Was Thrown That A Girl Was Born Karthikadeepam Monita The Story Of Monita Real Life

బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ గురించి, అందులో నటించే నటీనటుల గురించి అందరికీ తెలిసిందే.ఎందుకంటే ఈ సీరియల్ ప్రేక్షకులనే కాకుండా సెలబ్రెటీలను కూడా ఆకట్టుకుంది.

 I Was Thrown That A Girl Was Born Karthikadeepam Monita The Story Of Monita Real Life-TeluguStop.com

ఇందులో వంటలక్క, డాక్టర్ బాబు పాత్రలకు ఎంత క్రేజ్ ఉందో మోనిత అనే విలన్ పాత్రకు అంతే క్రేజ్ వుంది.నిజానికి మోనితకు ఈ సీరియల్ ద్వారానే మంచి గుర్తింపు వచ్చింది.

ఇదిలా ఉంటే తన నిజజీవితంలో కొన్ని ఎమోషనల్ విషయాల గురించి పంచుకుంది.అదేంటో తెలుసుకుందాం.

 I Was Thrown That A Girl Was Born Karthikadeepam Monita The Story Of Monita Real Life-ఆడపిల్ల పుట్టిందని నన్ను విసిరేశారు.. కార్తీకదీపం మోనిత నిజజీవితంలో కన్నీళ్ల కథ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మోనిత అసలు పేరు శోభా శెట్టి. ఈమె కన్నడకు చెందిన నటి.ఇక శోభ శెట్టి కన్నడ, తెలుగు బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటించింది.ప్రస్తుతం తెలుగులో హిట్లర్ గారి పెళ్ళాం, కార్తీకదీపం సీరియల్ లో బిజీగా ఉంది.

ఏ సీరియల్ కు అందుకోనంత గుర్తింపు ఈ సీరియల్ తోనే అందుకుంది శోభా శెట్టి.పైగా ఎంతోమంది తెలుగు ప్రేక్షకులను అభిమానులుగా మార్చుకుంది.

ఇక సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.సోషల్ మీడియాలో కూడా ఎంతో ఫాలోయింగ్ సంపాదించుకుంది.

ఇటీవలే తన పేరు మీద ఓ యూట్యూబ్ ఛానల్ కూడా క్రియేట్ చేసుకుంది.అందులో తనకు సంబంధించిన విషయాలను బాగా పంచుకుంటుంది.

తన తల్లిదండ్రులను కూడా చాలాసార్లు పరిచయం చేసింది.

Telugu Born, Karthika Deepam, Monita, Story, Rela Struggles, Shoba Shetty, Queens Show, Zee Telugu-Movie

తనకు ఒక సోదరుడు, ఇద్దరు సోదరీమణులు ఉన్నారు.ఇదిలా ఉంటే శోభ శెట్టి తాజాగా ఓ షో లో పాల్గొని బాగా ఎమోషనల్ అయ్యింది.బుల్లితెరపై జీ తెలుగులో ప్రసారం అవుతున్న సూపర్ క్వీన్స్ అనే షో లో పాల్గొంటుంది.

ఇక ఈ షో నిన్న ప్రారంభం అవ్వగానే ఇందులో ఎంట్రీ లో శోభా శెట్టి బాగా ఎమోషనల్ అవుతూ అందరికీ కంటనీరు తెప్పించింది.

Telugu Born, Karthika Deepam, Monita, Story, Rela Struggles, Shoba Shetty, Queens Show, Zee Telugu-Movie

తను ఈ షోలో పాల్గొన్నందుకు తన తండ్రి, తల్లి కూడా వచ్చారు.వారిని వేదికపై పిలిచి అందరికీ పరిచయం చేశారు.ఇక తన తల్లి శోభా శెట్టి గురించి కొన్ని విషయాలు పంచుకుంది.

తన తండ్రి కూడా శోభ శెట్టి పడిన కష్టాల గురించి చెప్పుకున్నాడు.ఇక తనకు ఇద్దరు అక్కలు, ఒక అన్న ఉన్నారంటూ ఏ రోజు కూడా తన తండ్రి ముగ్గురు ఆడపిల్లలు అని బాధ పడలేదని తెలిపింది.

Telugu Born, Karthika Deepam, Monita, Story, Rela Struggles, Shoba Shetty, Queens Show, Zee Telugu-Movie

ఇక చిన్నప్పుడు తన తండ్రి వల్ల తండ్రి (శోభ శెట్టి తాత) ఏదో చిన్న కుటుంబ కలహాల వల్ల ఆడపిల్ల పుట్టింది అని జోలాతో సహా తనని విసిరేశారని చెప్పటంతో అక్కడున్న వారందరూ శోభ తో పాటు బాగా ఎమోషనల్ అయ్యారు.ఆ తర్వాత ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నామని.తన తండ్రి చదువుకోలేదని అయినా కూడా తమ అందర్ని బాగా పెంచారని తెలిపింది.అలా కొన్ని విషయాలు పంచుకుంటూ ఆడపిల్ల పుడితే తప్పేంటి అని ఆడపిల్ల ఎప్పటికైనా ఆడపిల్లనే అంటూ ఆడపిల్ల సూపర్ క్వీన్ అంటూ అద్భుతంగా మాట్లాడింది శోభా శెట్టి.

#Story #Struggles #Shoba Shetty #Born #Monita

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube