సందీప్ గురించి ఆ విషయం తెలిసి ఆశ్చర్యపోయా: అడివి శేష్

హీరో అడవి శేష్ ప్రధాన పాత్రలో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత ఆధారంగా తెరకెక్కిన చిత్రం మేజర్. ఈ సినిమా జూన్ 3వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.

 I Was Surprised To Know That Thing About Major Sandeep Says Adivi Sesh Details, Adivi Shesh, Tollywood, Comment, Sandeep, Telugu Film Industry, Major Sundeep Unnikrishnan, Adivi Sesh Major Movie, Adivi Sesh Interview, Major Sundeep Unnikrishnan Biopic-TeluguStop.com

విడుదలకు మరికొన్ని రోజుల సమయం మాత్రమే ఉండటంతో చిత్రబృందం పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా హీరో అడవి శేష్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఈ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా అడివి శేష్ మాట్లాడుతూ 26/11 సంఘటనలు జరిగాక ఆయన ఫొటోలు బయటకు వచ్చాక మా కజిన్ బ్రదర్ సందీప్ పోలికలు నీలో కూడా కనిపిస్తున్నాయని తనకు చెప్పారు.

 I Was Surprised To Know That Thing About Major Sandeep Says Adivi Sesh Details, Adivi Shesh, Tollywood, Comment, Sandeep, Telugu Film Industry, Major Sundeep Unnikrishnan, Adivi Sesh Major Movie, Adivi Sesh Interview, Major Sundeep Unnikrishnan Biopic-సందీప్ గురించి ఆ విషయం తెలిసి ఆశ్చర్యపోయా: అడివి శేష్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక సందీప్ మరణం తర్వాత ఆయనకు అశోక్ చక్ర వచ్చినప్పుడు అతని గురించి చదివి ఆయనకు పెద్ద అభిమానిగా మారాను.

క్షణం సినిమా షూటింగ్ సమయంలో ఆయన బయోపిక్ చేయాలనే ఆలోచన వచ్చింది.గూడచారి సమయంలో ఈ ఆలోచన మరింత ఎక్కువైందని తెలిపారు.ఇకపోతే సందీప్ గురించి లోతుగా తెలుసుకున్నప్పుడు ఏవైనా ఆశ్చర్యం కలిగించే సంఘటనలు ఉన్నాయా అనే ప్రశ్నలు ఎదురయ్యాయి.

అందుకు అడివి శేష్ సమాధానం చెబుతూ… సందీప్ ఇండియన్ ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ తీసుకొని ట్రైన్ లో తిరిగి ఇంటికి వెళ్తుండగా ఆయనతో పాటు తన స్నేహితుడు కూడా ఉన్నారు.

Telugu Adivisesh, Adivi Sesh, Adivi Shesh, Sandeep, Telugu, Tollywood-Movie

అతను అస్సాంలో దిగాలి, సందీప్ బెంగళూర్ లో దిగాలి.ఆ సమయంలో తన ఫ్రెండ్ నా దగ్గర డబ్బులు లేవని అడగడంతో సందీప్ తన జేబులో ఉన్న డబ్బులు మొత్తం తనకు ఇచ్చాడు.ఆ తర్వాత సందీప్ దగ్గర డబ్బులు లేకపోవడంతో ఆయన బెంగళూరు వచ్చే వరకు ఏమి తినకుండా, తాగకుండా ఎవరిని సహాయం అడగకుండా అలాగే ఉన్నారు.సందీప్ మిలిటరీ మనిషి కాబట్టి ఎవరిని ఏమి అడగకూడదు అని రూల్ ఉంటుంది.

ఇలా ఫ్రెండ్ కోసం ఉన్న డబ్బులు ఇచ్చి తాను అలా ఉన్నారని తెలిసి ఎంతో ఆశ్చర్యపోయానని ఈ సందర్భంగా అడివి శేష్ వెల్లడించారు.అయితే సినిమాలో ఇలాంటి సంఘటనలు పెడితే నమ్ముతారో లేదో అని ఈ సన్నివేశాన్ని సినిమాలో పెట్టలేదని ఆయన వెల్లడించారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube