రజనీకాంత్ సార్ ను చూడగానే వణికిపోయాను.. ఆ అనుభవాన్ని గుర్తు చేసుకున్న సుకుమార్!

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో అద్భుతమైన గుర్తింపు సంపాదించుకుంది.ఈ క్రమంలోనే ఈ సినిమాపై ఎంతో మంది ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

 I Was Shocked To See Rajinikanth Sir Sukumar Remembered That Experience Sukumar,-TeluguStop.com

ఇదిలా ఉండగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత పెద్దఎత్తున ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఎంతో బిజీగా ఉన్న సుకుమార్ ఈ సినిమా గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు.

తాజాగా సుకుమార్ ఓ తమిళ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ గత జ్ఞాపకాలను అనుభవాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

ఈ క్రమంలోనే రోబో సినిమా షూటింగ్ జరిగే సమయంలో తనకు రజనీకాంత్ సార్ కి మధ్య జరిగిన ఒక అనుభవాన్ని ఈ సందర్భంగా సుకుమార్ గుర్తుచేసుకున్నారు.రోబో సినిమా షూటింగ్ జరిగే లొకేషన్ కి నేను వెళ్ళినప్పుడు రజనీకాంత్ సార్ ఆర్య సినిమా చూసి నన్ను గుర్తుపట్టి పలకరించడానికి వచ్చారు.

అలా ఆయన వస్తుంటే నేను వణికి పోతూ సర్ సర్ అని చెబుతుండగా.ఆర్య సినిమాలో హీరోయిన్ జుట్టు ఊడుతూ పడిపోయే సీన్ చాలా బాగుందని మెచ్చుకున్నారు.

Telugu Allu Arjun, Arya, Kollywood, Rajinikanth, Sukumar, Tollywood-Movie

ఇలా మాట్లాడుతున్న సమయంలో స్వయంగా రజినీకాంత్ గారే షాట్ రెడీ అయిందని వెళ్లిపోయారు.అలా ఆయన వెళుతుంటే లేచి నిలబడ్డాను.వెంటనే రజనీ సార్ కూర్చో అంటూ తనకి కుర్చీ వేశారని ఆ అనుభవాన్ని తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని ఈ సందర్భంగా రజనీకాంత్ తో తనకున్న అనుభవాన్ని సుకుమార్ ఈ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube