15 ఏళ్ళ వయసులోనే లైంగిక వేధింపులకు గురయ్యాను.. టీవీ నటి షాకింగ్ కామెంట్స్?

బయట ఎంతోమంది అమ్మాయిల పై లైంగిక వేధింపులు జరుగుతూనే ఉన్నాయి.ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో అమ్మాయిలు, చిన్నారులు, స్త్రీలు ఇలా తాము తమ పనిచేసే చోట, ప్రయాణం చేసే చోట లేదా మరే చోటైనా లైంగిక వేధింపులు ఎదుర్కొంటూనే ఉంటారు.

 I Was Sexually Abused At The Age Of 15 Tv Actress Sakshi Talwar Shocking Comment-TeluguStop.com

ఉన్నారు కూడా.కానీ చాలామంది ఈ దాడిని ఎదుర్కొంటున్న సమయంలో తిరిగి ఆ దుండగుల పై ఎదిరించలేకపోతారు.

మరికొందరు ఎదిరించడానికి ప్రయత్నిస్తారు.ఇప్పటికే ఎంతోమంది అమ్మాయిలు లైంగిక దాడికి గురై ప్రాణాలు విడిచారు.మరికొందరు వాటిని తట్టుకోలేక ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు.ఇటీవలే ఓ చిన్న బాలికను కూడా ఓ దుర్మార్గుడు లైంగిక దాడికి పాల్పడి చివరికి ఆ బాలికను ప్రాణాలతో లేకుండా చేశాడు.

అలా భూమిపై అమ్మాయిలకు రక్షణ లేకుండా పోతుంది.

ఇదిలా ఉంటే సినీ ఇండస్ట్రీకి చెందిన వాళ్లు కూడా సినీ ఇండస్ట్రీలో లైంగిక దాడులకు గురవుతుంటారు.

ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీలు మీడియా ముందుకు వచ్చి తాము ఎదుర్కొన్న లైంగిక దాడుల గురించి నేరుగా పంచుకున్నారు.సినీ ఇండస్ట్రీలోనే కాదు ఆడవాళ్లు పని చేసే చోట ఎక్కడైనా కూడా ఇటువంటి దాడులు ఎదురవుతూనే ఉన్నాయి.

ఇదిలా ఉంటే ఓ టీవీ నటి కూడా తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి కొన్ని విషయాలు పంచుకుంది.

Telugu Ameer Khan, Bollywood, Dangalactress, Delhi Gang, Hindi, Sakshi Talwar, S

ఇంతకీ ఆమె ఎవరో కాదు సాక్షి తల్వార్.ఈమె హిందీ బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించింది.

అమీర్ ఖాన్ నటించిన దంగల్ సినిమాలో నటించి తన పాత్రకు మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఇక ఈమె బుల్లితెరపై పలు షోలలో కూడా చేసింది.

తన నటనకు పలు అవార్డులను కూడా సొంతం చేసుకుంది.ఇదిలా ఉంటే గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొని కొన్ని విషయాలు పంచుకుంది.

ఆ మధ్య ఢిల్లీలో గ్యాంగ్ రేప్ జరిగిన సమయంలో చాలా మంది సెలబ్రిటీలు తాము ఎదుర్కొన్న చేదు అనుభవాలను పంచుకున్నారు.ఇక ఈ నేపథ్యంలో సాక్షి తల్వార్ కూడా తన గురించి కొన్ని విషయాలు పంచుకుంది.

సభ్య సమాజంలో సిగ్గుపడేలా సంఘటనలు జరుగుతున్నాయని తాము కూడా ఎదుర్కోలేక పోతున్నామని తెలిపింది సాక్షి.

Telugu Ameer Khan, Bollywood, Dangalactress, Delhi Gang, Hindi, Sakshi Talwar, S

రాజధానిలో డీటిసీ బస్సులో ప్రయాణం అంత సులభం కాదని 15వ ఏటనే లైంగిక వేధింపులు ఏంటో తెలుసుకున్నానని తెలిపింది.ఆరోజు తనకు ఇంకా గుర్తు ఉందని ఓ వ్యక్తి అలా అసభ్యంగా ప్రవర్తించాడని ఇంటికి వెళ్లి ఏడ్చానని తెలిపింది.ఆ సమయంలో తన తల్లి, తన అక్కకి జరిగిందంతా చెప్పేసరికి వాడిని ఎందుకు కొట్టలేదు అని, గట్టిగా ఎందుకు అరవలేదని ప్రశ్నించారట.

అప్పట్లో తనకు అలాంటి సందర్భాలను ఎలా ఎదుర్కోవాలో తెలియలేదని ఆ సంఘటన తరువాత ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే మౌనంగా ఉండేలేదని తెలిపింది.తనకు తన కుటుంబ సభ్యులు అండగా ఉండటం వల్ల ధైర్యం వచ్చిందని కాబట్టి ప్రతి ఒక్కరు తమ పిల్లలకు ఇటువంటి విషయాలను ఎదుర్కోవాలని వారికి సలహాలు ఇవ్వమని కోరింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube