నేను అతన్ని సుఖపెట్టేందుకు పుట్టలేదు.. సమంత ఏంటి చైతూకి అలాంటి కౌంటర్ ఇచ్చింది?

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటీనటులు సమంత, నాగచైతన్య ఎప్పుడైతే విడిపోయారో అప్పటినుంచి వీరి నుండి ఏ మాట వచ్చినా కూడా అది బాగా వైరల్ అవుతుంది.ఒకరినొకరు ఉద్దేశించుకొని అలా వ్యాఖ్యలు చేస్తున్నారా అన్నట్లుగా వీరి మాటలు బాగా వైరల్ అవుతున్నాయి.

 I Was Not Born To Make Him Happy What Kind Of Counter Did Samantha Give To Chait-TeluguStop.com

తాజాగా సమంత చైతుకి మరో విధంగా కౌంటర్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఇంతకూ అసలేం జరిగిందో చూద్దాం.

ఏ మాయ చేసావే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది సమంత.ఇక ఈ సినిమాలో నాగచైతన్య కూడా నటించిన సంగతి తెలిసిందే.అయితే ఈ సినిమా సమయంలో వీరిద్దరికీ పరిచయం పెరగటంతో ఇద్దరు ప్రేమలో పడ్డారు.అలా కొంతకాలం ఎవరికీ తెలియకుండా రహస్యంగా తమ ప్రేమాయణం నడిపారు.

ఆ తర్వాత మంచి సమయం చూసుకొని ఇంట్లో వాళ్లకి చెప్పి అందరి సమక్షంలో హిందూ సాంప్రదాయం ప్రకారం, క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం ఘనంగా వివాహం చేసుకున్నారు.

Telugu Chaitu, Em Mayachesave, Born, Happy, Naga Chaitanya, Samantha, Tollywood,

ఇక పెళ్లి తర్వాత ఈ జంటను చాలామంది చూసి మురిసిపోయారు.పైగా సమంతకు అక్కినేని కోడలుగా అడుగుపెట్టాక కూడా మరింత కలిసి వచ్చింది.పలు బిజినెస్ లు కూడా ప్రారంభించింది.

పెళ్లి తర్వాత పలు సినిమాలలో, అడ్వటైజ్మెంట్లలో కూడా కలిసి నటించారు.ఏదైనా ఈవెంట్ లలో వీరిద్దరూ కలిసి వస్తుంటే ఈ జంటని చూసి మురిసిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు.

అలా మూడు సంవత్సరాల వరకు టాలీవుడ్ లో ఈ జంట క్యూట్ కపుల్ గా కనిపించింది.కానీ ఎప్పుడైతే సోషల్ మీడియాలో సమంత అక్కినేని అనే పేరును తొలగించిందో అప్పటినుంచి జనాల్లో అనుమానాలు వచ్చాయి.

వీరిద్దరి విడిపోతున్నారా అని జోరుగా వార్తలు వినిపించాయి.అన్నట్టుగానే కొంతకాలానికి వీరిద్దరూ విడిపోతున్నాము అన్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపారు.

వీరిద్దరి విడిపోవడాన్ని ఇప్పటికీ తమ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.ఇంకా కలిసే అవకాశాలు ఉన్నాయేమో అన్నట్లుగా ఎదురు చూస్తున్నారు.కానీ వారి మాటలు వారి ప్రవర్తన బట్టి చూస్తే వీరిద్దరూ ఇక కలవరు అన్నట్లుగా కనిపిస్తుంది.ఇక వీరిద్దరు విడిపోవడానికి కారణం ఏంటో తెలియలేదు కానీ ఇప్పటివరకు అందరూ సమంతదే తప్పు అన్నట్లుగా భావిస్తున్నారు.

Telugu Chaitu, Em Mayachesave, Born, Happy, Naga Chaitanya, Samantha, Tollywood,

చాలావరకు సమంత గురించే నెగటివ్ గా వార్తలు వినిపించాయి.ఇక వీటిపై సమంత సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు సీరియస్ వార్నింగులు ఇస్తూ కనిపించింది.ఇక ఇప్పుడు ఈ బ్యూటీ వరుస సినిమాలతో బాగా బిజీగా దూసుకెళ్తుంది.ఒకవైపు బిజినెస్ లు చూసుకుంటూ మరోవైపు సినిమాలలో సైన్ చేసుకుంటూ పోతుంది.

ఇక ఇటీవల తను అరుదైన వ్యాధితో బాధపడుతున్న సంగతి బయటపడింది.దీంతో కొంతవరకు తనకు సింపతి కూడా వచ్చింది.

అయితే అదే సమయంలో తను నటించిన యశోద సినిమా కూడా విడుదల కాగా మంచి బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది.అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో సమంత నాగచైతన్య గురించి కొన్ని కామెంట్లు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

ఓ యూట్యూబ్ ఛానల్ కి సమంత ఇంటర్వ్యూ ఇవ్వగా అందులో తను నాగచైతన్య పై ఇండైరెక్టుగా కామెంట్లు చేసినట్లు తెలుస్తుంది.లైఫ్ లో మనం అనుకున్నది సాధించడానికి ఎంత కష్టమైనా సరే తట్టుకోవాలి అంటూ.

మనకు నచ్చినట్లు మాత్రమే బతకాలి అని.అంతేకానీ ఎవరినో సుఖ పెట్టడానికి మనం పుట్టలేదు కదా అంటూ షాకింగ్ కామెంట్ చేసినట్లు తెలిసింది.

Telugu Chaitu, Em Mayachesave, Born, Happy, Naga Chaitanya, Samantha, Tollywood,

అంతేకాకుండా ఒకరి కింద అణిగిమనిగి ఉండాల్సిన అవసరం మనకు లేదు అంటూ.దేనినైనా ఎదిరించి ముందుకు వెళ్లాలి.అప్పుడే లైఫ్ లో మనం ముందుకు వెళ్లగలుగుతాం అంటూ షాకింగ్ కామెంట్లు చేసినట్లు తెలుస్తుంది.అయితే ఇదంతా నాగచైతన్య ను ఉద్దేశించే అలా మాట్లాడింది అని కొందరు అనుకుంటున్నారు.

ఇక నాగచైతన్య అభిమానులు సమంత ఏంటి నాగచైతన్య ను ఇలా అనేసింది అంటూ ఫైర్ అవుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube