Rajasekhar Faima : రాజశేఖర్ ఎలిమినేట్ కావడానికి నేను అస్సలు కారణం కాదు: ఫైమా

I Was Not At All The Reason Rajasekhar Was Eliminated Faima ,Rajasekhar , Faima,bigg Boss6 , Bigg Boss Season Six,Jabardast,Nagarjuna, Eviction Free Pass

బిగ్ బాస్ సీజన్ సిక్స్ తెలుగు కార్యక్రమం చివరి దశకు చేరుకుంది.ఇప్పటికే 13 వారాలను పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమంలో భాగంగా 13వ వారం బిగ్ బాస్ ఇంటి నుంచి ఫైమా బయటకు వచ్చారు.

 I Was Not At All The Reason Rajasekhar Was Eliminated Faima ,rajasekhar , Faima-TeluguStop.com

జబర్దస్త్ కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె బిగ్ బాస్ కంటెస్టెంట్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.ఇలా బిగ్ బాస్ కార్యక్రమంలో ఎంతో అద్భుతంగా టాస్కులలో పాల్గొంటూ 13 వారాల పాటు కొనసాగిన ఫైమా ఈ వారంలో బయటకు వచ్చేసారు.

ఎలిమినేట్ అయిన తర్వాత ఇంటర్వ్యూలకు హాజరవుతూ ఎన్నో విషయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా ఫైమా మాట్లాడుతూ చాలామంది నేను ఎలిమినేట్ కావడానికి నా వెటకారమే కారణమని చెబుతున్నారు.

అయితే నేనెప్పుడూ కూడా వెటకారంగా మాట్లాడలేదని అలా మాట్లాడి కనుక ఉంటే నాగార్జున సార్ గారు ఎప్పుడూ నన్ను తిట్టేవారు అంటూ ఈమె చెప్పుకొచ్చారు.ఇకపోతే రాజశేఖర్ నా వల్లే ఎలిమినేట్ అయ్యారని చాలామంది అంటున్నారు.

తను ఎలిమినేట్ కావడానికి నేను అసలు కారణం కాదని ఫైమా తెలియజేశారు.

ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉండడం వల్ల తాను సేవయ్యానని లేకపోతే ఆరోజు తానే ఎలిమినేట్ కావాల్సి ఉందని, అలాకాకుండా తన సేఫ్ కావడంతో రాజశేఖర్ ఎలిమినేట్ అయ్యారు అంటూ చాలామంది భావిస్తున్నారు.నిజానికి నాకు ఏవిక్షన్ పాస్ ఉండడం వల్లతాను ఎలాగో సేఫ్ అవుతానని చాలామంది నాకు ఓట్లు వేసి ఉండకపోవచ్చు అందువల్ల నాకు ఓట్లు తక్కువ పడ్డాయి కానీ, నా వల్ల రాజశేఖర్ ఎలిమినేట్ అయ్యారు అనడం సమంజసం కాదంటూ ఈ సందర్భంగా ఫైమా చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube