ఇక్కడే పుట్టా, ఇక్కడే చస్తా అంటున్న మెగాస్టార్

తన వివాదాస్పద వాఖ్యల మీద స్పందించిన జనాల మీద తిరిగి స్పందించాడు ఆమీర్ ఖాన్.2006లో విడుదలై భారి విజయాన్ని సొంతం చేసుకున్న ఆమీర్ చిత్రం “రంగ్ దే బసంతి” పది సంవత్సరాలు పూర్తీ చేసుకున్న సందర్భంగా నిన్న ముంబైలో మీడియా సమావేశం ఏర్పాటు చేసారు.ఆ చిత్రంలో ఆమీర్ తో పాటు సినిమాలో నటించిన తమిళ తెలుగు నటుడు సిద్ధార్థ్ , బాలివుడ్ నటుడు శర్మన్ జోషి తో పాటు , దర్శకుడు రాకేశ్ ఓం ప్రకాష్ మెహ్రా, ఇతర సాంకేతిక నిపుణులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

 I Was Born In India And I Will Die Here – Aamir Khan-TeluguStop.com

అమీర్ మాట్లాడుతూ ” నేనుప్పుడు భారతం దేశం అసహనపు దేశం అనలేదు.

అసలు దేశం విడిచి వెళ్ళిపోతానని అని కూడా అనలేదు.నా వాఖ్యాలను తప్పుగా అర్థం చేసుకున్నారు.

దానికి కారణం మీడియా.నేనెందుకు సత్యమేవ జయతే చేస్తాను ? నా దేశం అంటే నాకు ఇష్టం అనే కదా.మన దేశం చాలా గొప్పది.ఎందుకు మతం అనే రంగుని అంటగడుతున్నారో తెలియదు.

మన దేశంలో విభిన్నతలో ఐక్యత ఉంది.

నా కుటుంబాన్నే తీసుకోండి.

నా భార్య ఒక హిందూ.నా ఇద్దరు చెల్లెళ్ళు హిందువులనే పెళ్లి చేసుకున్నారు.

నా తమ్ముడు ఒక క్రిస్టియన్ ని పెళ్లి చేసుకున్నాడు.నాకు ముగ్గురు పిల్లలు.

వాళ్ళు సగం హిందువులు సగం ముస్లీములు.నేను కాని , నా భార్య కాని మత ప్రభావం వాళ్ళపై పడేలా చుసుకోవట్లేదు.

నేను ఒక స్వాతంత్ర్య సమరయోధుడి కుటుంబం నుంచి వచ్చాను.నాకు నా దేశం కన్నా ఏది ఎక్కువ కాదు.నేను మొదట భారతీయుడ్ని, ఆ తరువాతే అన్ని.నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే చస్తాను ” అంటూ భావోద్వేగంగా ప్రసంగించాడు ఆమీర్.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube