నన్ను కూడా కమిట్ మెంట్ అడిగారు... సంచలన విషయాలు వెల్లడించిన నయనతార!

I Was Also Asked For A Commitment Nayanthara Revealed Sensational Things ,Lady Superstar,Nayanthara,Casting Couch,Nayanthara Casting Couch,Commitment,Nayanthara Remuneration ,

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చి స్థిరపడాలి అంటే కెరియర్ మొదట్లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.ఇలా ఎంతోమంది నటీమణులు కెరియర్ మొదట్లోనే క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులను ఎదుర్కొన్న సంఘటనల గురించి ఇదివరకే పలు సందర్భాలలో తెలియచేశారు.

 I Was Also Asked For A Commitment Nayanthara Revealed Sensational Things ,lady S-TeluguStop.com

అలాగే కొంతమంది క్యాస్టింగ్ కౌచ్ అనేది కేవలం ఇండస్ట్రీలో మాత్రమే కాదని ప్రతి ఒక్క రంగంలో కూడా ఈ ఇబ్బందులు మహిళలకు ఎదురవుతూనే ఉన్నాయని అయితే మన వ్యవహార శైలి మన ప్రవర్తన బట్టి ఇబ్బందులు తలెత్తుతూ ఉంటాయని చెప్పుకొచ్చారు.

Telugu Lady, Nayanthara-Movie

ఈ క్రమంలోనే దక్షిణాది సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నయనతార గురించి అందరికీ సుపరిచితమే.దాదాపు రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతూ సౌత్ ఇండస్ట్రీలోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న నటీమణిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.పెళ్లయినప్పటికీ ఈమె వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.

Telugu Lady, Nayanthara-Movie

ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి నయనతార ఇండస్ట్రీలో ఉన్నటువంటి క్యాస్టింగ్ కౌచ్ గురించి నోరు విప్పారు.ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది లేదు అనే విషయం గురించి తాను మాట్లాడనని అయితే మన ప్రవర్తన బట్టి మనకు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయని ఈమె తెలియజేశారు.తాను ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో తనని కూడా చాలా మంది కమిట్మెంట్ అడిగారని అయితే నాకు ఇష్టం లేదని నిర్మొహమాటంగా చెప్పానని నయనతార వెల్లడించారు.నేను కేవలం నా టాలెంట్ నమ్ముకుని ఇండస్ట్రీలోకి వచ్చాను.

నా టాలెంట్ తోనే ప్రస్తుతం ఈ స్థాయికి చేరుకున్నాను అంటూ ఈ సందర్భంగా నయనతార క్యాస్టింగ్ కౌచ్ గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube