నాకు నా కుటుంబానికి సింపుల్ గా ఉండడమే ఇష్టం.. డబ్బు, ఫేమ్ కాదు: ప్రణీత

టాలీవుడ్ ఇండస్ట్రీలో అందరి మనసులు దోచుకున్న కన్నడ బ్యూటీ ప్రణీత సుభాష్ గురించి అందరికీ పరిచయమే.తన అందంతో, నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది.

 I Want To Keep It Simple For My Family Heroine Pranitha Subhash Comments Details-TeluguStop.com

ఏం పిల్లో.ఏం పిల్లడో అనే సినిమాతో తొలిసారిగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైంది.

ఆ తర్వాత పలు సినిమాలలో నటించగా.

 I Want To Keep It Simple For My Family Heroine Pranitha Subhash Comments Details-TeluguStop.com

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమాలో నటించి తన పాత్రకు మంచి గుర్తింపు తెచ్చుకుంది.

అలా బ్రహ్మోత్సవం, రభస వంటి పలు సినిమాలలో నటించింది.కానీ ఎందుకో టాలీవుడ్ ఇండస్ట్రీలో అంతగా మెప్పించలేకపోయింది.టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా నటించింది.

ఇక కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా నటించి తనేంటో నిరూపించుకుంది.

గతంలో కోవిడ్ సమయంలో కూడా ఎంతో మంది ప్రజలకు సహాయం చేయడానికి ముందుకు వచ్చింది.అంతేకాకుండా ప్రణీత ఫౌండేషన్ పేరు మీద ఇప్పటికీ ప్రతిరోజు సహాయం చేస్తూనే ఉంటుంది.

Telugu Bangalore, Nitin Raj, Praneetha, Prnitha Subhash-Movie

ఇక ఈమె బాలీవుడ్ లో మంచి సక్సెస్ లో ఉన్న సమయంలో బెంగళూరుకు చెందిన నితిన్ రాజ్ అనే ఓ బడా బిజినెస్ మాన్ ను అతికొద్ది మంది కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకుంది.ఇటీవలే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.ఇక ప్రణీత సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్ గా ఉంటుంది.

అప్పుడప్పుడూ తన వ్యక్తిగత విషయాలను, తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను పంచుకుంటుంది.

ఈమెకు సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది.ఇక తనకు సంబంధించిన ఫోటోలను కూడా బాగా షేర్ చేసుకుంటుంది.

ఈమధ్య తన కూతురు ఫోటోలను కూడా పంచుకుంటుంది.తన ఫాలోవర్స్ తో కూడా బాగా ముచ్చట్లు పెడుతుంది.

Telugu Bangalore, Nitin Raj, Praneetha, Prnitha Subhash-Movie

తనకు ఎదురైన ప్రశ్నలకు విసుగు చెందకుండా ఓపికగా సమాధానం చెబుతుంది.ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా తన ఇన్ స్టా వేదికగా మరోసారి తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు పెట్టింది.అందులో వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పింది.ఇక తన కూతురి జాగ్రత్తల గురించి కూడా ప్రశ్నలు ఎదురవటంతో వాటికి కూడా సమాధానం ఇచ్చింది.

ఇక ఓ నేటిజన్.నువ్వు ఎలా ఉంటావు నీ వ్యక్తిత్వం ఎలాంటిది అని అడగటంతో.

వెంటనే తను తనతో పాటు తన కుటుంబం కూడా సింపుల్ గా ఉండటానికి ఇష్టపడుతుంది అని అంతేకానీ డబ్బు, ఫేమ్ కోసం అన్నట్లుగా ఉండమని చెప్పింది ప్రణీత.ఇక ప్రస్తుతం ఆమె ఇచ్చిన సమాధానం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇక ప్రణీత ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ మొత్తం ఫ్యామిలీతో బాగా బిజీగా ఉందని తెలుస్తుంది.ఇక తనకు కూతురు కూడా పుట్టడంతో ఈ సమయంలో తన కూతురికి, తన ఫ్యామిలీకి బాగా దగ్గరగా తాను ఉండాలనుకుంటుంది.

మరి తన అభిమానుల కోసం మళ్లీ సినిమాల్లో అడుగుపెడుతుందో లేదో చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube